ఇక ఇప్పటికే వైజాగ్ ,హైదరాబాద్ , ముంబై , చెన్నై వంటి ప్రాంతాల్లో తండేల్ మూవీ టీం స్పెషల్ ఈవెంట్లు కూడా నిర్వహించింది . అయితే ఇప్పుడు హీరోయిన్ సాయి పల్లవి అనారోగ్యానికి గురయ్యారని గత కొన్ని రోజులుగా ఫిలిం వర్గాల్లో కొన్ని వార్తలు వైరల్ గా మారాయి . ఇక ఇప్పుడు తాజాగా ఈ వార్తలపై దర్శకుడు చందు మొండేటి స్పందించాడు .. ముంబైలో జరిగిన ట్రైలర్ కార్యక్రమానికి ఆమె రాకపోవడంపై ఆయన స్పందిస్తూ సాయి పల్లవి ఆరోగ్యంపై షాకింగ్ అప్డేట్ ఇచ్చారు. ఇక సాయి పల్లవి గత కొన్ని రోజులుగా జ్వరం జలుబుతో బాధపడుతున్నారని .. అయినప్పటికీ కూడా ఆమె సినిమాకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ..
ఇక దీంతో ఆమె మరింత నీరసం అయిపోయారు. వైద్యులు ఆమెకు కనీసం రెండు రోజులపాటు బెడ్ రెస్ట్ అవసరమని సూచించారు .. అందుకే ఇప్పుడు ముంబై వేదికగా జరిగిన ఈ ట్రైలర్ ఈవెంట్లో ఆమె హాజరు కాలేదని చందు చెప్పుకొచ్చాడు. ఇక తండేల్ సినిమాని గుజరాత్ లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా దర్శకుడు ఎక్కించారు.. ఈ ప్రేమ కథలో రాజుగా నాగచైతన్య , బుజ్జి తల్లిగా సాయి పల్లవి కనిపించబోతున్నారు .. లవ్ స్టోరీ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇక మరి ఈ సినిమాతో నాగచైతన్య ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి.