కళా తపస్వి డైరెక్టర్ కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం శంకరాభరణం.. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ సినిమా సాధించిన రికార్డులంటూ చాలానే ఉన్నాయట. తెలుగు సినిమా కీర్తిని దేశం మొత్తం చాటి చెప్పేలా చేసిన మొట్టమొదటి సినిమాగా పేర్కొంది. ఈ సినిమా ఫిబ్రవరి 2వ తేదీన విడుదలై రేపటికి 45 ఏళ్లు పూర్తి చేసుకుంటుందట. అల్లు రామలింగయ్య, జేవీ సోమయాజులు, మంజు భార్గవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.


శంకరాభరణం చిత్రాన్ని తమిళనాడు ,కేరళ ,కర్ణాటక ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాలలో కూడా విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారట. అమెరికాలో రెగ్యులర్ థియేటర్లో కూడా విడుదలైన మొట్టమొదటి చిత్రంగా పేరు పొందింది. ఈ సినిమా ఎన్నో దేశాలలో విడుదలై సత్తా చాటింది. ఈ సినిమా విడుదలైన తర్వాత చాలామంది శాస్త్రీయ సంగీతాన్ని కూడా నేర్చుకొని పేరు సంపాదించారట. శంకరాభరణం చిత్రానికి అవార్డుల పరంగా చాలానే వచ్చాయట. తెలుగులో స్వర్ణకమలం అనే అవార్డు కూడా అందుకున్నారట. ఈ సినిమాకి పాటలు పాడినందుకు ఉత్తమ గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రమణ్యానికి మొట్టమొదటిసారి జాతీయ అవార్డు అందుకున్నారట.


అలాగే ఉత్తమ గాయకురాలుగా వాణిజయరాం ఉత్తమ సంగీత డైరెక్టర్ గా కె.వి.మహదేవ్ వంటి వారు ఈ చిత్రానికి జాతీయ అవార్డులు అందుకున్నారు. ఏకంగా ఎనిమిది నంది అవార్డులను గెలుచుకొని సరికొత్త రికార్డులను సృష్టించిందట. శంకరాభరణం చిత్రం పైన చాగంటి కోటేశ్వరరావు సుమారుగా 72 గంటల పాటు ప్రవచనాలు కార్యక్రమాన్ని చేశారట. ఇలాగే చిత్రంలోని ఎన్నో పాటలకు సన్నివేశాలకు సైతం స్పెషల్ క్రేజ్ ఉన్నదని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని నిర్మించినటువంటి ఏడిద నాగేశ్వరరావు చెన్నై, హైదరాబాద్ వంటి ప్రాంతాలలో తాను నిర్మించుకున్న ఇంటికి శంకరాభరణం అనే పేరు కూడా పెట్టుకున్నారట. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన గౌరవం కూడా లభించిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: