బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. శృంగార తారగా ప్రతి ఒక్కరిని ఈ అమ్మడు ఆకట్టుకుంది. అంతేకాకుండా సినిమాలలోనూ స్టార్ గా రాణిస్తోంది. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసుకుంటూ అక్కడి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. హిందీలో స్పెషల్ సాంగ్స్ తో పాటు బోల్డ్ పాత్రలలోనూ సన్నీలియోన్ నటించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలోనూ సన్నీలియోన్ కి భారీగా ఫాలోవర్స్ ఉండడం విశేషం.

అయితే సన్నీలియోన్ తెలుగులోనూ అనేక సినిమాల్లో నటించింది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ చేసి ఈ చిన్నది ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. రాజశేఖర్ నటించిన గరుడవేగ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకుంది. అనంతరం కరెంట్ తీగ, జిన్నా వంటి సినిమాలలోనూ నటించింది. అయితే తాజాగా సన్నీలియోన్ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిందని ఆరోపిస్తూ హైకోర్టుకు ఫిర్యాదు చేశారు.


రెస్టారెంట్ & బార్ నిర్మాణం కారణంగా ఇందిరా గాంధీ ప్రతిష్టన్ గోప్యత, భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఫిర్యాదు దారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ వివాదం పైన జస్టిస్ అశోక్ కుమార్ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశాడు. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేశారు. ఈ నిర్మాణం హైకోర్టుకు సమీపంగా ఇందిరా గాంధీ ప్రతిష్టాన్ కి చేరువలో ఉండడం వల్ల చిక్కులు మరింతగా పెరిగాయని తెలుస్తోంది.


డెవలపర్ ఆమోదించబడిన సైట్ ప్లాన్ ని వదిలేసి పోరుగున ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారనేది పిటిషన్ లో ప్రధాన ఆరోపణగా నిలిచింది. ఈ నిర్మాణం ఇందిరా గాంధీ ప్రతిష్టన్ గోప్యత, భద్రతకు ముప్పు కలిగిస్తుందని పేర్కొంటూ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సన్నీలియోన్ తదుపరి విచారణకు హాజరు కావాల్సి ఉంది. ప్రస్తుతానికి బార్ అండ్ రెస్టారెంట్ చైన్ విస్తరణకు అంతరాయం కలిగింది. ఈ బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ కేసు పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: