టాలీవుడ్‌ స్టార్‌ నటుడు బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నరేష్ హీరోగా నటించిన శ్రీ తాతావతారం అనే సినిమాతో నటుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అనంతరం ఆహనా పెళ్ళంట సినిమాతో బ్రహ్మానందం మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ సినిమా అనంతరం బ్రహ్మానందం వరుసగా సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో తన హవాను కొనసాగించాడు. ఒక్కొక్క పాత్రతో తనదైన మార్క్, కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.


స్టార్ కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. బ్రహ్మానందాన్ని ఎలా చూసిన ఆడియోన్స్ ముఖంలో నవ్వులు విదజిల్లుతాయి. దాదాపు 1250 కి పైగా సినిమాలలో నటించిన బ్రహ్మానందం 2010లో పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకోవడం విశేషం. సినీ దర్శక నిర్మాతలకే కాదు టాప్ మోస్ట్ హీరోలకు కూడా అతను ఒక ఫేవరెట్ కమెడియన్ గా మారిపోయారు. ఆయన వలన ఎంతో మంది హీరోల సినిమాలు హిట్ అయ్యాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.


టాలీవుడ్‌ స్టార్‌ నటుడు బ్రహ్మానందం కోసమే సినిమాలు చూసే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. బ్రహ్మానందం నెలవారి సంపాదన రూ. రెండు కోట్ల కన్నా ఎక్కువగానే ఉంటుందని అనేక రకాల వార్తలు వస్తూనే ఉంటాయి. కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్ ద్వారా కూడా విపరీతంగా ఆదాయాలు వస్తున్నాయట. ఈయన ఒక్కో ఎండార్స్మెంట్ కోసం కోటి నుంచి రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది.


దీంతో బ్రహ్మానందం నికర ఆస్తుల విలువ సుమారు రూ. 500 కోట్లకు పైనే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు జీవించి ఉన్న నటులలో అత్యధిక సినిమాల్లో నటించిన నటుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా బ్రహ్మానందం క్రియేట్ చేసుకున్నారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. బ్రహ్మానందంకి భారీగా వ్యాపారాలు కూడా ఉన్నాయి. బ్రహ్మానందం కుమారులు కూడా భారీగా డబ్బులను సంపాదిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: