పాన్ ఇండియా హీరో ప్రభాస్ , హను రాఘవపూడి కాంబినేషన్లో తెర‌కెక్కుతున్న ఫౌజి సినిమాపై పాన్ ఇండియా స్థాయి లో బీభత్సమైన అంచనాలు ఉన్నాయి .. 1940 వ‌ర‌ల్డ్ వార్ నేపథ్యంలో ఎమోషనల్ లవ్ స్టోరీ గా ఈ సినిమాను తీసుకురాబోతున్నారు .. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఓ బ్రాహ్మణ యువకుడిగా అలాగే ఓ బ్రిటిష్ సైనికుడిగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ పౌజ్‌కు కొంత కనెక్షన్ ఉందని కూడా అంటున్నారు .. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో తెర్కతున్న ఈ సినిమాలో హీరోయిన్గా ఇమాన్మి ఇప్పటికే కన్ఫర్మ్ అయింది .. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ కోసం సినిమా యూనిట్ తగిన ఎంపిక చేసినట్లు తెలుస్తుంది .. అయితే ఈ సినిమాలో ఎంతో కీలకమైన అంశం ఫ్లాష్ బ్యాక్ అని తెలుస్తుంది.. ఈ సినిమాకు బలం అంతా ఫ్లాష్ బ్యాక్ అని సమాచారం.


ఇక దర్శకుడు హ‌నురాఘ‌వ‌పూడి తన మునుపటి సినిమాలు లానే ఇందులోనూ స్లోగా ఎమోషన్ను బలంగా మలచనున్నారని అంటున్నారు. ఇక ఈ ఫ్లాష్ బ్యాగ్ లో ప్రభాస్ పాత్రను ఇప్పటివరకు చూడని కొత్త యాంగిల్‌ల్లో చూపించబోతున్నారట .. ఈ భాగ్యంలోనే కనిపించబోయే మరో హీరోయిన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ చాలా రోజులుగా వెతుకుతుంది .. అలాగే ఈ క్యారెక్టర్ కోసం పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లను కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఒకవేళ ఈ కథలో ఈ పాత్ర కేవలం ఫ్లాష్ బ్యాక్ కోసం మాత్రమే ఉంటే నటిగా బలమైన పర్సనాలిటీ కలిగిన వాళ్ళే ఆ పాత్రకు న్యాయం చేయగలరని భావిస్తున్నారు .. ఇప్పటికే పలువురు పేర్లను పరిశీలించగా .. ఇక ఇప్పుడు చివరగా ఈ పాత్ర సాయి పల్ల‌వికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక సాయి పల్లవి గతంలో హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన పడి పడి లేచే మనసు సినిమాలో కూడా నటించింది .. దర్శకుడు గతంలో జరిగిన పలు అనుభవాలను గుర్తు చేసుకుంటూ మరోసారి ఆమెను కలిసి కథ చెప్పారని కూడా వార్తలు వస్తున్నాయి.


ఇక ఇప్పుడు తాజాగా హను రాఘవపూడి , సాయి పల్లవితో భేటీ అయినట్టు తెలుస్తుంది.   తండెల్ మూవీ ప్రమోషన్లలో భాగంగా సాయి పల్లవి ఈ కథ విన్నట్టు టాక్‌ .. హను రాఘవపూడి కథ చెప్పగానే సాయి పల్లవి ఎంతో ఎగ్జిట్ అయి సినిమాలో నటించడానికి ఒకే చెప్పినట్టు టాలీవుడ్ వర్గాలో ప్రచారం జరుగుతుంది.. అయితే ఇప్పటివరకు ఆమె దగ్గర నుంచి ఈ సినిమాపై ఎలాంటి అధికార ప్రకటన రాలేదు .. తండేల్‌ మూవీ ప్రమోషన్లు పూర్తయిన తర్వాత ఈ సినిమాపై కీలక నిర్ణయం తీసుకోవాలని సాయి పల్లవి భావిస్తున్నట్టు తెలుస్తుంది . ఇక ఫౌజి సినిమాకు సాయి పల్లవి ఓకే చెప్పితే ఈ సినిమాపై మరింత అంచనాలు పెరుగుతాయి .. ఇక ప్రభస్ తో నటించడానికి ఒకే చెప్తారా... లేక మరో హీరోయిన్ ను ఈ పాత్రకు తీసుకుంటారా అనేది ఇప్పుడు ఎంతో ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: