నట‌సింహం నందమూరి బాలకృష్ణ కు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భం గా ఈరోజు సాయంత్రం ఓ భారీ పార్టీ జరగబోతుంది .. ఇంత‌కి ఈ పార్టీ ఇస్తుంది మరెవరో కాదు .. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య బాలకృష్ణ సోదరి భువనేశ్వరి .. హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఫామ్ హౌస్ లో ఈ పార్టీ జరగబోతుంది .. ఈ పార్టీ కి నారా , నందమూరి ఫ్యామిలీకి ఎంతో క్లోజ్ గా ఉండే ప్రముఖుల కు మాత్రమే ఆహ్వానం అందింది ..అలాగే  పలువురు రాజకీయ ప్రముఖులకు కూడా ఆహ్వానాలు ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.


ఇక ఈ రీసెంట్ టైమ్స్ లో బాలకృష్ణ ఇమేజ్ ఊహించని రేంజ్ లో పెరగడంతో పాటు మహిళా ప్రేక్షకులతో పాటు యువతకు ఆయనను బాగా దగ్గర చేయటంలో ఆహాలో వచ్చిన అన్ స్టాపబుల్ షో ఎంతో హెల్ప్ అయ్యింది .. ఈ షో రూపకల్పనలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ పాత్ర ఎంతో ఉంది .. దీనికి కర్త కర్మ క్రియ అన్ని ఆయనే .. ఇప్పుడు ఈ కార్యక్రమానికి అల్లుఅరవింద్ కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది .. అలాగే ఆయనతో పాటు పలువురు నిర్మాతలను కూడా ఆహ్వానించారట .. ఇక బాలకృష్ణ స్టార్ హీరోలతో పాటు ఇప్పటి తరం హీరోలు కూడా కొందరు ఈ కార్యక్రమానికి రాబోతున్నారు.. అయితే ఈ పార్టీకి ఎవరెవరు వస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.


ఇక పద్మభూషణ్ పురస్కారం కేవలం  తనది మాత్రమే కాదని ఇది తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవం అని బాలకృష్ణ ఇటివ‌ల‌ ఓ కార్యక్రమంలో చెప్పుకోచ్చారు .. ప్రస్తుతం బాలయ్య చేస్తున్న సినిమాలు విషయానికొస్తే ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ గా వ‌చ్చి 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబెట్టారు ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 సినిమా చేస్తున్నారు. బాలయ్యకు పద్మ అవార్డు ప్రకటించిన తర్వాత బాలయ్యకు ఇది తొలి సన్మాన పార్టీ .. రాబోయే రోజుల్లో మరెన్ని సన్మాన పార్టీలు కూడా జరగబోతున్నాయి .. మరి ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ వైపు నుంచి ఎవరు ఊహించిన ఓ పెద్ద ఈవెంట్ కూడా ఉండబోతుంది .. త్వరలోనే దీనిపై కూడా ఓ క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: