తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థలో గీత ఆర్ట్స్ కూడా ఒకటి .. అల్లు అరవింద్ నిర్మాతగా టాలీవుడ్ లో ఎన్నో పెద్ద సినిమాలను తీసుకువచ్చారు .. అయితే గీత ఆర్ట్స్ అంటే అల్లు అరవింద్.. జిఏ 2 (గీత ఆర్ట్స్ 2) అంటే బన్నీ బాస్ .. మొన్నటి వరకు ఈ లెక్క .  ఇక ఇప్పుడు తండేల్‌ సినిమా నుంచి మరో లెక్క .. గీత ఆర్ట్స్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్ పై నిర్మాతగా అల్లు అరవింద్ పేరు కాకుండా ఇప్పుడు బన్నీ వాస్ పేరు రానుంది .. ఇక అల్లు అరవింద్ పేరు ఒక ప్రజెంట్ గానే ఉండనుంది .. అయితే దీని వెనుక ఊహించని కారణం ఏంటి? గీత ఆర్ట్స్ ను  నేటి తరానికి అందించే సమయం వచ్చిందంటున్నారు అల్లు అరవింద్ .. ఎవరైనా తనను గట్టిగా డిమాండ్ చేస్తే తప్ప ఇకపై తన బ్యానర్లో నిర్మాతగా తన పేరు ఉండదని ఆయన ప్రకటించారు.

ఇప్పటికే నిర్మాతగా ఎన్నో సినిమాలు తెరకెక్కించాను .  ఇక ఇప్పుడు ఈ గీత ఆర్ట్స్ సంస్థలో నా స్థానం మిగతా వాళ్లకు ఇచ్చే సమయం వచ్చేసింది .. నా తర్వాత ఈ గీత ఆర్ట్స్ లో బన్నీ వాసు, విద్యా మాధురి ఉన్నారు .. ఏదైనా సినిమాకు నిర్మాతగా నా పేరు మాత్రమే ఉండాలని ఎవరైనా డిమాండ్ చేస్తే తప్ప ఇక పై ఏ సినిమాకు నా పేరు ఉండదు .. అందుకే ఇప్పుడు నా ప్లేస్ ను బన్నీ వాస్‌కి దార‌ దత్తం చేస్తున్నాను. ఒక విధంగా చెప్పాలంటే అల్లు అరవింద్ ఎంతో సంచల నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి .. తన నిర్మాతగా తన వారసత్వాన్ని బన్నీ వాస్ కు ఇచ్చేశాడు .. ఇక బన్నీ వాస్‌ను అల్లు అరవింద్ ఎంతలా నమ్ముతున్నారో చెప్పడానికి దీన్నిబట్టే చెప్పవచ్చు ..


అయితే నా సంస్థలో బన్నీ వాస్‌ను కేవలం ఒక ఉద్యోగిగా చూడటం లేదని అల్లు అరవింద్ అంటున్నారు .. నాకు ఏదైనా సలహా అవసరమైతే వెంటనే బన్నీ వాస్‌ని అడుగుతానని అంటున్నారు తండెల్ మూవీ విషయానికొస్తే ఈ కథను ముందుగా బన్నీ వాసఏ తెచ్చాడని అతడే డెవలప్మెంట్ లో ఉన్నాడని అలాగే హీరో నాగచైతన్య కూడా ఆయనకు మంచి ఫ్రెండ్ అని అందుకే గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాతగా బన్నీవాస్ పేరును తండేల్‌ సినిమా నుంచి ప్రారంభించబోతున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించారు. ఇక మరి బన్నీ వాస్ రాబోయే రోజుల్లో గీత ఆర్ట్స్ తో అల్లు అరవింద్ ను మర్పించే సినిమాలను ఎంతవరకు తీస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: