టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి గురించి అందుకుంది. ఆ సినిమా అనంతరం తెలుగులో వరుసగా అనేక సినిమాలో నటించి నేషనల్ క్రష్ హీరోయిన్ గా మారిపోయింది. రష్మిక నటించిన సినిమాలు అన్ని దాదాపుగా హిట్ అవడం విశేషం. ఈ బ్యూటీతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు.


దానికి గల ప్రధాన కారణం రష్మిక చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్నాయి. రీసెంట్ గా రష్మిక నటించిన పుష్ప సినిమా ఎంతగానో రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాలో రష్మిక నటనను చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. పుష్ప-2 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ చిన్నది ప్రస్తుతం తన చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉండగా.... ఈ బ్యూటీకి మరో సినిమాలో అవకాశం వచ్చింది.


అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ సినిమాలో షారుక్ ఖాన్ హీరోగా నటించారు ఈ సినిమాని రూ. 1000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అట్లీ దర్శకత్వం వహించే తదుపరి సినిమాలో హీరోయిన్ రష్మికను పెట్టి సినిమాను తీయనున్నారట. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారట. ఈ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం ప్రారంభం కానుంది.


ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో తీయనున్నారట. మొదట ఈ సినిమాలో కమల్ హాసన్ ను హీరోగా పెట్టే సినిమా తీయాలని అనుకున్నారట. కానీ కమల్ హాసన్ ఈ సినిమాకి ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు రజనీకాంత్ తో ఈ సినిమా ఆఫర్ వచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. అయితే.. ఈ సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రష్మిక కు ఛాన్స్‌ వచ్చిందట. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: