ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా సినీ నటుడుగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ కూటమిలో భాగంగా కీలకమైన రాజకీయనేతగా వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎలాంటి విషయాలోనైనా సరే ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ రాజకీయాల విషయంలో సినిమాల విషయంలో కొంతమంది పలు రకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వాక్యాలు ఇప్పుడు మరొకసారి వైరల్ గా మారుతున్నాయి.


ఇటీవలే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ చిరంజీవి రెండు స్థానాలలో పోటీ చేస్తే కేవలం ఒకచోట మాత్రమే గెలిచారు. కమలహాసన్ వంటి హీరోలు ఎన్నికలలో కూడా ఓడిపోయారు. కమలహాసన్ కంటే పవన్ కళ్యాణ్ గొప్ప నటుడేం కాదు కదా అంటూ ఎద్దేవా చేశారు. ఇక బాలయ్య విషయానికి వస్తే హిందూపురం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన మూడుసార్లు గెలిచారని తెలియజేశారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన పేరు చాలా ఎక్కువగా వినిపించింది. ముఖ్యంగా ప్రజల సమస్యకై ఉదయం గుడ్ మార్నింగ్ అని అందర్నీ పలకరిస్తూ ధర్మవరం నియోజవర్గం చుట్టూ తిరిగేవారు.


అయినా కూడా స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓడిపోవడం జరిగింది కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. అయినప్పటికీ కూడా తాను పార్టీని మారని తనకంటూ ఒక గుర్తింపు వచ్చింది వైసీపీ పార్టీ వల్లే రాజశేఖర్ రెడ్డి కుటుంబం వల్లే అని తెలియజేశారు. ఇటీవలే కూడా వైసిపి పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు అరెస్టే అన్నట్లుగా తెలియజేశారు.. అలాగే ఎన్నో సందర్భాలలో కూడా అటు కూటమి ప్రభుత్వం పైన ఎటు వైసిపి ప్రభుత్వం పైన పలు రకాల వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు కేతిరెడ్డి.. మరి 2029 ఎన్నికలలో గెలుస్తారేమో చూడాలి మరి.. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్లో వెకేషన్ ముడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: