సినిమా ఇండస్ట్రీ లో అనేక మంది నటి నటులు సినిమాల ద్వారా పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్న వారు అనేక మంది ఉన్నారు. అలాంటి వారిలో కిరణ్ అబ్బవరం , రహస్య గోరక్ కూడా ఉంటారు. కిరణ్ అబ్బవరం "రాజ వారు రాణి గారు" అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలోనే రహస్య గొరక్ హీరోయిన్గా నటించింది. ఈ ముద్దు గుమ్మకు కూడా ఇదే మొదటి సినిమా.

సినిమా విడుదల సమయం లో ఈ ఇద్దరికి పెద్దగా గుర్తింపు లేకపోవడం , అలాగే ఈ మూవీ కి పని చేసిన టెక్నీషియన్స్ కి కూడా పెద్దగా క్రేజ్ లేకపోవడంతో ఈ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయింది. విడుదల తర్వాత ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడం వల్ల ఈ మూవీ ద్వారా కిరణ్ , రహస్య ఇద్దరికీ మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే రహస్య "రాజ వారు రాణి గారు" సినిమా తర్వాత మూవీలు చేయడం ఆపేసింది. కిరణ్ మాత్రం ఫుల్ స్పీడ్ గా సినిమాలు చేస్తూ వచ్చాడు. ఆయన నటించిన కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ఈయనకు నటుడిగా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే మొదటి సినిమా అయినటువంటి రాజా వారు రాణి గారు సినిమాలో కలిసిన నటించిన కిరణ్ , రహస్య మొదటి సినిమాతోనే ప్రేమలో పడిపోయారు.

ఆ తరువాత కిరణ్ , రహస్య ఇద్దరు కూడా తమ ప్రేమను అలాగే కంటిన్యూ చేశారు. ఇక ఈ ఇద్దరి మధ్య పరస్పర అంగీకారం పెరగడం వల్ల వీరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. దానితో పెద్దలు కూడా వీరి పెళ్లికి అంగీకారంతో కొంత కాలం క్రితమే వీరు వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత కిరణ్ నటించిన "క" అనే సినిమా వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం వీరి సంసార జీవితం ఎంతో ఆనందంగా , అద్భుతంగా ముందుకు సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: