టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరుపొందిన దిల్ రాజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు తన ఖాతాలో వేసుకున్న ఈ నిర్మాత ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇందులో వెంకటేష్ ,మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించారు. ఈ చిత్రానికి సంబంధించి డిజిటల్ ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున చేయడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. చాలామంది బయ్యర్లకు కూడా ఈ సినిమా లాభాలను అందించిందట.రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా కలెక్షన్స్ దుమ్ము దులిపేస్తుంది.



300 కోట్ల మార్పు దిశగా అడుగులు వేస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా తాజాగా మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఒక గ్రాండ్ మీటింగ్ ని ఏర్పాటు చేసుకున్నారట. అక్కడ దిల్ రాజ్ మాట్లాడుతూ ఈ సినిమా విజయం తనకు ఒక గుణపాటాన్ని నేర్పిందని తెలిపారు. కాంబినేషన్ సినిమాలు అంటూ నాలుగైదు ఏళ్ళుగా చాలా తరబడుతున్నానని ఈ సినిమాతో మళ్ళీ తాను దారిలోకి వచ్చాను అంటూ తెలిపారు. తన బ్యానర్లో డైరెక్టర్ అనిల్ రావుపూడి ఆరు చిత్రాలు చేశారని కథల విషయంలో చర్చించుకున్నామని.. ఆయన విషయంలో తాను ఎప్పుడూ కూడా ఒత్తిడిగా  ఫీల్ అవ్వలేదని తెలిపారు.



పడిపోతున్న తమని డైరెక్టర్ అనిల్ పైకి తీసుకువచ్చారని.. పదేళ్లుగా తమకు ఎలాంటి డోకా లేదని విజయాలు చాలానే అందుకున్నామని తెలిపారు. బడ్జెట్ ఏ కాదు కథ కూడా ముఖ్యమనీ నిర్మాత తెలియజేశారు.. వాస్తవానికి నిర్మాత దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమా హక్కుల తో పాటు సంక్రాంతికి వస్తున్నాం సినిమా హక్కులను కూడా తీసుకున్నారు. గేమ్ ఛేంజర్ చిత్రం నిరాశపరిచిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి లాభాలను అందుకోవడం జరిగింది. అందుకే రాబోయే రోజుల్లో కాంబినేషన్స్ని కాదు కథలను బట్టి సినిమాలను తెరకెక్కిస్తారు అన్నట్లుగా మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: