షూటింగ్ సమయంలో ఈ జంట ఎంతో క్లోజ్ గా ఉండేవారు .షూటింగ్ తరువాత కూడా ఎంతో స్నేహంగా ఉండేవారట.వారిద్దరి మధ్య స్నేహం కొన్నాళ్లకు ప్రేమగా మారిందీ..అయితే వీరి ప్రేమ విషయాన్నీ ఎవరికీ తెలియకుండా వారు ఎంతో జాగ్రత్త పడ్డారు..కొన్నాళ్ళ పాటు తమ రిలేషన్ ను ఎంతో సీక్రెట్ గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు..ఆ తర్వాత ఈ జంట ‘అంతరిక్షం’అనే సినిమాలో మరోసారి కలిసి నటించారు.. అయితే ఆ సినిమా సమయంలో వరుణ్-లావణ్య డేటింగ్ లో ఉన్నారంటూ న్యూస్ వైరల్ అయింది..ఇక ఆ తర్వాత ఇద్దరూ ప్రైవేట్ పార్టీలలో కూడా కలిసి కనిపించడం.. అలాగే వరుణ్ చెల్లెలు నిహారిక వివాహానికి హాజరైన అతి కొద్ద మంది సన్నిహితుల్లో లావణ్య కూడా ఉండటంతో వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే న్యూస్ బాగా వైరల్ అయింది..ఆ తర్వాత డిసెంబర్ 15న లావణ్య పుట్టిన రోజు సందర్బంగా వరుణ్ తేజ్ లావణ్య కు పెళ్లి ప్రపోజ్ చేసినట్లు సమాచారం..
ఆ తర్వాత ఇద్దరూ ఇరు కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్లికి ఒప్పించారు..అయితే వారు తమ ప్రేమ విషయాన్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు.కొన్నాళ్ళకు వీరి ప్రేమను ఇరు కుటుంబాల వారు అధికారికంగా ప్రకటించారు.. అంగరంగ వైభవంగా వీరి నిశ్చితార్దం జరిపారు...నవంబర్ 1 2023 న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇటలీలో వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాలతో పాటు బంధువులు, స్నేహితుల సమక్షంలో లావణ్య త్రిపాఠి మెడలో వరుణ్ తేజ్ మూడు ముళ్లు వేశాడు.ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ కపుల్ గా వరుణ్ తేజ్, లావణ్య నిలిచారు