ఏంటి శోభిత పెళ్లి పీటల మీదే అల్లు అరవింద్ కి వార్నింగ్ ఇచ్చిందా.. ఇంతకీ ఏ విషయంలో వార్నింగ్ ఇచ్చింది..అంత పెద్ద నిర్మాతకు శోభిత ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుతం నాగచైతన్య సాయి పల్లవి చందు మొండేటి అల్లు అరవింద్ బన్నీ వాస్ లు వీళ్ళందరూ కలిసి తండేల్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాకు సంబంధించిన విషయాలే కాకుండా పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటున్నారు. అలా తాజాగా అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని శోభిత పెళ్లి పీటల మీద ఏం అడిగిందో బయట పెట్టేశారు.మరి ఇంతకీ శోభిత ఏం అడిగిందో ఇప్పుడు చూద్దాం.. తండేల్ సినిమాలో నాగచైతన్య గెటప్ వేరే లెవెల్ లో ఉంది అని చెప్పుకోవచ్చు.

ముఖ్యంగా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎలా అయితే గెటప్ మార్చేసే గడ్డం పెంచి జుట్టు పెంచారో అచ్చం అల్లు అర్జున్ లాగే తండేల్ మూవీ కోసం నాగచైతన్య కూడా గడ్డం పెంచి జుట్టు పెంచారు. అయితే పెళ్లిలో కూడా నాగచైతన్య అలాగే గడ్డం జుట్టుతో కనిపించారు.ఎందుకంటే పెళ్లి కోసం తీసేస్తే మళ్లీ షూటింగ్ కి ఇబ్బంది అవుతుంది అనే కారణంతో పెళ్లి సమయంలో కూడా అలాగే కనిపించారు. అయితే వీళ్ళ పెళ్లికి అల్లు అరవింద్ వెళ్ళారట. ఇక పెళ్లి పీటల మీద నవ దంపతులను ఆశీర్వదించిన అల్లు అరవింద్ కి నాగచైతన్య నా వైఫ్ అన్నట్లుగా శోభితను పరిచయం చేశారట.

అయితే శోభితను అల్లు అరవింద్ కి పరిచయం చేస్తున్న సమయంలో సర్  మీకు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. నా భర్త మొహం ఎప్పుడు చూపిస్తారు.ఆ గడ్డం వల్ల నాగచైతన్య ఫేస్ ని చూడలేకపోతున్నాను అని అడిగిందట. దానికి అల్లు అరవింద్ నాగచైతన్య ఫేస్ చూడాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.సినిమా రిలీజ్ అయిన వెంటనే మీరు నాగచైతన్య ఫేస్  చూడొచ్చు అని చెప్పారట. అలా ఒకరకంగా పెళ్లి పీటల మీదే నాగచైతన్య వైఫ్ శోభిత దూళిపాళ్ల అల్లు అరవింద్ కి రిక్వెస్ట్ తో కూడిన వార్నింగ్ ఇచ్చిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: