అక్కినేని నాగార్జున ప్రొఫెషనల్ లైఫ్ బాగున్నప్పటికీ పర్సనల్ లైఫ్ మాత్రం అంత బాగా లేదని చెప్పుకోవచ్చు. అయితే అది ఒకప్పటి మాట..ఇప్పుడైతే అంత సెట్ అయింది కాని ఇప్పటికి కూడా అప్పుడప్పుడు వీరి ఫ్యామిలీ గురించి కొన్ని రూమర్లు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా నాగార్జున రెండు పెళ్లిళ్లకి సంబంధించి వార్తలు ఎక్కువగా వినిపిస్తాయి.నాగార్జున మొదట దగ్గుబాటి రామానాయుడు కూతుర్ని పెళ్లి చేసుకొని, ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చేసి అమలను పెళ్లి చేసుకున్నారు. ఇక మొదటి భార్యతో నాగార్జునకు నాగచైతన్య పుట్టాక రెండో భార్యతో అఖిల్ పుట్టారు. అయితే నాగార్జున రెండు పెళ్లిల్లే కాదు మూడో పెళ్లికి కూడా చేసుకోవాలనుకున్నారని అప్పట్లో చాలానే వార్తలు వినిపించాయి. మరి ఇంతకీ అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో నటించే సెలబ్రిటీలపై రూమర్లు రావడం సహజమే.

కానీ నాగార్జున పై మాత్రం ఈ రూమర్లు ఎక్కువగా వినిపించాయి. ముఖ్యంగా నాగార్జున ఇతర హీరోయిన్లతో ఉండే క్లోజ్నెస్ ని చూసి చాలామంది ఆ హీరోయిన్లతో నాగార్జునకి ఎఫైర్ ఉన్నట్టు వార్తలు రాశారు. ముఖ్యంగా నాగర్జున కి టబు,రమ్యకృష్ణ,అనుష్క వంటి హీరోయిన్లతో ఈయనకు రిలేషన్ ఉన్నట్టు వార్తలు రాశారు.అందరికంటే ఎక్కువగా టబుతో నాగార్జునకి ఇప్పటికి ఎఫైర్ వార్తలు వినిపిస్తాయి.. అయితే ఈ వార్తలు రావడానికి కారణం వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యమే. ముఖ్యంగా టబు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా నాగార్జున ఇంట్లో ప్రత్యక్షమవ్వడంతో ఈ వార్త నిజమే అనుకుంటారు. ముఖ్యంగా టబుని నాగార్జున మూడో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని, కానీ నాగేశ్వరరావుకు భయపడి అప్పుడు పెళ్లి చేసుకోలేదు అనే రూమర్లు వినిపించాయి.

ఇక అమల వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ తెలిసిన కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది అని వార్తలు వినిపిస్తాయి. అయితే ఈ వార్తలో ఉన్నది ఎంత నిజమో  తెలియదు కానీ నాగార్జున మాత్రం టబు నాకు మంచి ఫ్రెండ్ అంటారు.కానీ అర్ధరాత్రిలు గంటలు గంటలు ఫోన్ చేసి మాట్లాడుతుందని చెబుతారు. కేవలం ఫ్రెండ్షిప్ ఉంటే గంటలు గంటలు ఫోన్లలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది ముఖ్యంగా ప్రతిరోజు టబూ నాకు ఫోన్ చేస్తుంది అని నాగార్జున చెబుతారు అది కూడా అర్ధరాత్రి.. ఇక ఈ మాటల కారణంగానే వీరి మధ్య ఎఫైర్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తాయి. ఇప్పటికి కూడా టబుకి నాగార్జునకు మధ్య రిలేషన్ కొనసాగుతుంది అని అంటూ ఉంటారు. అలాగే టబు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కూడా నాగార్జున అని అంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: