సినిమా లవర్స్ కి శుభవార్త. ఈ నెలలో చాలా సినిమాలు విడుదల కానున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న విడాముయార్చి సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో హీరోయిన్స్ గా త్రిష, రెజీనా కాసాండ్రా నాటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ నెల 6వ తేదీన విడుదల కానుంది. అలాగే తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమాకి అశ్వత్ మారీముత్తు దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమాలో ప్రదీప్ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 21 వ తేదీన రిలీజ్ అవ్వనుంది. ఇక స్టార్ హీరో ధనుష్ కి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ధనుష్ దర్శకత్వం వహించిన సినిమా ఒకటి ఈ నెల 21న విడుదల కానుంది.
మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి నటించిన బజూక సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాకు గౌతమ్ వాసుదేవ్ దర్శకుడిగా చేస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్ అవుతుంది. ఇక టాలీవుడ్ సినిమాలోకి వస్తే లేడి పవర్ స్టార్ సాయి పల్లవి, అక్కినేని నాగ చైతన్య జంటగా నటిస్తున్న తండేల్ విడుదల కానుంది.తండేల్ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్, దేవి శ్రీ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు అంచనాలు పెరిగాయి. ఈ సినిమా శ్రీకాకుళం యాసలో తెరకెక్కనుంది. ఈ సినిమా హిట్ అవ్వడానికి ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. సాయి పల్లవి ఒక ఎత్తు. ఆమె ఒక సినిమాలో నటిస్తుందంటే చాలు ఆ సినిమా పక్క హిట్ కోడతుందని ముందే ఫిక్స్ అయిపోవాల్సిందే. ఎందుకంటే ఆమె సినిమాలను సెలెక్ట్ చేసుకునే విధానమే వేరు. అలాగే ఆ సినిమాలో సాయి పల్లవి నటన మామూలుగా ఉండదు. ఇక ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ అందించిన బుజ్జితల్లి పాటతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ సినిమా ఫిబ్రవరి 7 న ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించారు. అయితే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో నాగ చైతన్యకు పోటీ పడేటట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: