ఏడాదికి రెండు మూడు చిత్రాలతో బిజీగా ఉన్న శ్రీ లీల అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది. వరుస ప్లాప్స్ ఎదురవుతున్నప్పటికీ కూడా కొద్దిపాటి సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మళ్ళీ తిరిగి సినిమా షూటింగ్లలో బిజీగా మారిపోయింది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడమే కాకుండా అప్పుడప్పుడు పలు రకాల డ్యాన్స్ వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన డాన్స్ తో వేరే లెవల్లో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నట్లు ఒక వీడియో వైరల్ గా మారుతున్నది.
పొట్టి దుస్తులలో శ్రీ లీల క్రేజీ సాంగ్కు చిందులేస్తూ ఉన్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతూ స్టెప్పులు వేసినట్టుగా కనిపిస్తోంది. సింపుల్ స్టెప్స్ వేస్తూ హైలెట్ కావడమే కాకుండా అక్కడ ఉండే వాచ్మెన్తో కూడా ఈమె డాన్స్ వేయడం జరిగింది. ఈ వీడియో చూసిన అభిమానులు నెట్టిజెన్స్ సైతం శ్రీ లీల డ్యాన్స్ సూపర్ అంటూ పెడుతున్నారు. మొత్తానికి తన అందం అభినయంతోనే కాకుండా ఇలా అప్పుడప్పుడు చిల్ అవుతూ డాన్స్ వేస్తూ ఉంటుంది శ్రీలీల. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో నితిన్, రవితేజ, పవన్ కళ్యాణ్ తదితర హీరోల చిత్రాలలో బిజీగా ఉన్నది.