ఈ సినిమాలో హీరో డిల్లీ అబ్బాయిగా.. హీరోయిన్ కేరళ అమ్మాయిగా కనిపించనున్నారు. వీరిద్దరి మధ్య ఉండే ప్రేమకథనే ఈ సినిమా. త్వరలో ఈ మూవీ టీజర్ కూడా విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు దినేష్ విజన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా జులై 25న విడుదల కానుంది.
ఇక ఈ గ్లామరస్ హీరోయిన్ ఇటీవల దేవర సినిమాలో నటించింది. ఈమె దేవర సినిమాలో కొద్ది సమయం మాత్రమే కనిపించింది. కేవలం తన చిన్ననాటి రోల్ మాత్రమే కనిపిస్తుంది. కంప్లీట్ గా జాన్వీ ఎంటర్ అయ్యేది సినిమా సెకండాఫ్ లో మాత్రమే.. అయితే జాన్వీ కపూర్ కి ముందు చెప్పినట్టే పెద్దగా సినిమాలో స్కోప్ లేకుండా పోయింది. కేవలం పాటలు సినిమాలో ఉన్న సీన్స్ కూడా కొన్నే ఉండడంతో ఈమె పెద్దగా కనిపించలేదు. అయినప్పటికీ జాన్వీ కపూర్ తన అందాలతో యువతలో క్రాజ్ ని మాత్రం పెంచుకుంది.
కాగా దేవర పార్ట్ 2 సినిమాలో జాన్వీ రోల్ అదిరిపోతోంది అని కొరటాల శివ చెప్పడం జరిగింది. అటు గ్లామర్ తో పాటు ఇటు పెర్ఫామెన్స్ తో జాన్వి పార్ట్ 2 లో కనిపిస్తుందని సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ తో కలిపి జాన్వీ రోల్ కూడా ఫుల్ లెంగ్త్ లో కనిపిస్తుంది అని తెలిపారు. సో మొత్తానికి పార్ట్ 2 లో అయితే జాన్వీ కపూర్ రోల్ మామూలుగా ఉండదని తెలుస్తుంది.