అక్కినేని ఫ్యామిలీలో ఉన్న హీరోలకు పెళ్లిళ్లు కలిసి రావు అని అంటూ ఉంటారు చాలామంది.ఎందుకంటే వీరి ఫ్యామిలీలో నాగేశ్వరరావు తర్వాత నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఈ ముగ్గురూ కూడా పెళ్లిళ్ల విషయంలో కాస్త ఇబ్బందులు ఫేస్ చేశారు. నాగార్జున రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. అలాగే నాగచైతన్య కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు.ఇక అఖిల్ పెళ్లి చేసుకోక పోయినప్పటికీ రెండుసార్లు ఎంగేజ్మెంట్ అయితే చేసుకున్నారు.మొదట శ్రీయా భూపాల్ ఆ తర్వాత జైనబ్ రావడ్జి.. ఏది ఏమైనప్పటికీ వీరి ముగ్గురి పెళ్లిళ్ల విషయంలో మాత్రం ఒక కామన్ పాయింట్ అయితే ఉంది. నాగచైతన్య అఖిల్ ఇద్దరు మొదట ప్రేమ వివాహమే చేసుకోవాలి అనుకున్నారు.. అలా నాగచైతన్య సమంతని ప్రేమవాహం చేసుకున్నప్పటికీ అఖిల్ కి మాత్రం ఆదిలోనే షాక్ తగిలింది.. అఖిల్ శ్రియా భూపాల్ని ప్రేమించినప్పటికీ వీరి పెళ్లి జరగలేదు.

 ఎంగేజ్మెంట్ తర్వాత వీరి పెళ్లి ఆగిపోయింది.. అలా అన్నదమ్ములు ఇద్దరు మొదటి ప్రేమ వివాహమే చేసుకోవాలి అనుకున్నప్పటికీ ఇద్దరికీ కలిసి రాలేదు. నాగచైతన్య పెళ్లయ్యాక విడిపోతే అఖిల్ మాత్రం పెళ్లికి ముందే విడిపోయారు. అలా ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అలా నాగచైతన్య శోభిత ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటే అఖిల్ మాత్రం జైనబ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి ఈ ఏడాది ఉండబోతున్నట్టు తెలుస్తుంది.ఏది ఏమైనప్పటికి అక్కినేని కుటుంబంలో మొదటి పెళ్లిళ్లు కలిసిరావు అనడానికి ఈ ముగ్గురు హీరోలను ఉదాహరణగా తీసుకోవచ్చు. అలా వీరి వైవాహిక బంధం లో మొదటి ప్రేమ విషయంలో ఇద్దరు ఆనందంగా లేరు.

అలా రెండో పెళ్లికి నాగచైతన్య రెడీ అయితే అఖిల్ మాత్రం రెండోసారి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక వీరి పెళ్లిల విషయంలో మాత్రం సోషల్ మీడియాలో చాలా రూమర్లు ఫ్యామిలీ పై వినిపిస్తాయి.కానీ ఈ రూమర్లపై అక్కినేని ఫ్యామిలీ అంతగా స్పందించదు. ఇక ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం కాబట్టి వారి పర్సనల్ లైఫ్ కి భంగం కలిగేలా మాట్లాడకూడదు అని కొంతమంది అంటున్నారు.మరి కొంతమంది ఏమో దొరికిందే సందు అన్నట్లుగా వీరి ఫ్యామిలీపై రూమర్లు క్రియేట్ చేస్తూనే ఉంటారు. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం శోభీత ని పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు నాగచైతన్య.ఇక అఖిల్ కూడా త్వరలోనే పెళ్లికి సిద్ధమయ్యారు ప్రస్తుతం మీరు డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: