చాలా కొంతమంది మాత్రమే సమాజానికి ఉపయోగపడే సినిమాలను చూస్ చేసుకుంటూ ఉంటారు . మరి ముఖ్యంగా ఒక సీఎం పొజిషన్లో నటించాలి అంటే ఆ హీరోకి బాడీ కూడా చాలాఫిట్ గా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు సినిమాలో సీఎంగా నటిస్తే ఆ లుక్స్ అంతగా సెట్ కాకపోవచ్చు. అయితే మన తెలుగు ఇండస్ట్రీలో మాత్రం సీఎంగా కనిపించే లుక్స్ కొంతమంది హీరోస్ కి ఉన్నాయి . కానీ అందరూ కూడా ఆ లుక్స్ ని ఎంకరేజ్ చేయరు. అలాంటి రోల్స్ లో నటించడానికి సాహసం అస్సలు చేయరు.
కాగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో రానా దగ్గుబాటి . లీడర్ సినిమాలో సీఎంగా కనిపిస్తాడు . ఈ సినిమా ఆయన కెరియర్ లో ది బెస్ట్ మూవీ గా నిలిచిపోయింది . బాహుబలి సినిమా కన్నా కూడా రానా దగ్గుబాటి ఫ్యాన్స్ లీడర్ సినిమాలో ఆయన పర్ఫామెన్స్ కి ఎక్కువగా ఫిదా అయ్యారు అంటే ఆయన లుక్స్ ఈ సినిమా విషయంలో ఎంత కీలకంగా మారాయో అర్థం చేసుకోవచ్చు . ఆ తర్వాత "భరత్ అనే నేను" సినిమాలో మహేష్ బాబు సీఎం గా కనిపించారు . కానీ మహేష్ బాబు లుక్స్ పై అంత పాజిటివ్ కామెంట్స్ రాలేకపోయాయి. మహేష్ బాబుతో కంపేర్ చేస్తే సీఎం పొజిషన్లో సీఎం లుక్స్ లో రానా దగ్గుబాటినే చాలా చక్కగా కనిపించాడు అని చాలా చక్కగా రోల్ కి న్యాయం చేశాడు అని మహేష్ బాబు అంత న్యాయం చేయలేకపోయాడు సీఎం రోల్ కి అంటూ అప్పట్లో కామెంట్స్ వినిపించాయి. కొంతమంది మహేష్ బాబు కన్నా ఆ విషయంలో రానా దగ్గుబాటినే ది బెస్ట్ అంటూ కూడా మాట్లాడారు. అలా రానా దగ్గుబాటి కోట్లాదిమంది అభిమానుల మనసులను కొల్లగొట్టేసాడు..!