టాలీవుడ్ హీరో రామ్ చరణ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఆర్ఆర్‌ఆర్‌ సినిమాలో నటించి.. గ్లోబల్ స్టార్ గా ఫేమ్ సంపాదించుకున్నాడు. హీరో రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో సినిమా రాబోతుంది. ఇకపోతే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాకి ఆర్‌సీ 16 అనే టైటిల్ కూడా పెట్టేశారు. ఈ  సినిమాలో హీరోయిన్ గా జాన్వీకపూర్ నటిస్తుంది. అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల కోసం రీల్ కెమోరాలను ఉపయోగిస్తున్నట్లు సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు చెప్పారు. ఖర్చు కాస్త ఎక్కువ అయినప్పటికి కూడా.. ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది గనక ఈ కేమోరాలనె వినయోగిస్తున్నట్లు  తెలిపారు.
ఈ కెమెరాలలో సినిమా తీస్తే ఎడిటింగ్ కాస్త కష్టమైన నాచురాలిటీ కోసం తప్పదని చెప్పుకొచ్చారు. దానికోసమే 20 ఏళ్లు వెనక్కి వెళ్లి మరి పాత రీల్ కెమెరాతో తీస్తునట్లు చెప్పారు. ఇక రామ్ చరణ్ ఇప్పుడు ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్‌సీ 16  మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా పీరియాడిక్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది.
ఇక ఈ మూవీ గురించి పలు రకాల పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల గేమ్ ఛేంజర్‌ సినిమాతో రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకి వచ్చారు. డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా అంతగా హిట్ కొట్టలేదు. ఇక ఈ క్రమంలో బుచ్చిబాబు ఆర్‌సీ 16 సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. అందుకోసం సినిమా షూటింగ్ స్పీడ్ గా ముగించాలని బుచ్చిరాజు అనుకుంటున్నట్లు సమాచారం. దీనికోసం షూటింగ్ లో రామ్ చరణ్ కూడా జాయిన్ అయ్యారు. ఇక ఈ సినిమా షూటింగ్ ని ఈ ఆగస్టు వరకు పూర్తి చేయాలని మూవీ మేకర్స్  అనుకున్నట్లు తెలుస్తోంది. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే రాబోయే దసరా లేదా దీపావళికి ఈ సినిమా విడుదల అవుతుందని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే మెగా ఫాన్స్ కి పండగే పండగ. 

మరింత సమాచారం తెలుసుకోండి: