టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఇటీవలే గేమ్ ఛేంజర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఇక సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా అంతగా హిట్ కాలేదు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే తాజాగా జరిగిన ఒక ఈవెంట్ లో ఈ సినిమా డే 1 పోస్టర్ పై దిల్ రాజు స్పందించారు. 'దాని గురించి నేను మీకు ఆల్ రెడీ చెప్పాను కదా. మాకు వీక్ నెస్ లు ఉంటాయి. కొన్నింటికి మేము మాట్లాడలేము. మాకు వీక్ నెస్ ఉంటుంది అని నేను ఒప్పుకుంటున్నాను కదా. మీకు తెలుస్తాది కదా ఏ సెంటర్ లో ఎంత కలెక్షన్ వచ్చింది అనే డేటా మీ దగ్గర ఉంటది కదా.  సో నెక్ట్స్ టైమ్ నుంచి మీరే కాలిక్యులేట్ చేసి ప్రతి సినిమాకి పోస్టర్ వేయండి. అప్పుడు ఏ ప్రాబ్లమ్ ఉండదు' అని దిల్ రాజు ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక మెగా ఫాన్స్ అయితే సినిమా నిర్మాత దిల్ రాజుయే.. ఆ పోస్టర్ ఫేక్ అని ఒప్పుకున్నారని సోషల్ మీడియా వేదికగా చర్చలు నడుస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటించింది. అలాగే తెలుగు అమ్మాయి అంజలి కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇక స్క్రీన్‌పై లేనప్పటికీ అద్భుతమైన వ్యక్తిత్వాన్ని చాటుకునే అతికొద్ది మంది హీరోల్లో చరణ్‌ ఒకరు. ఇటీవల మరోసారి రామ్ చరణ్, దిల్ రాజు శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై సినిమా తీయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా టాక్ జోరుగా వినిపించింది. ఈ క్రమంలో రామ్ చరణ్ టీమ్ స్పందించింది. ఆ వార్తలను ఖండిస్తూ క్లారిటీ ఇచ్చింది. దిల్ రాజుతో, రామ్ చరణ్ మరో సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. అది అంతా అబద్దం అని.. అందులో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: