మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్ లతో జతకట్టారు. వారందరిలో ఆయనకు హిట్ పెయిర్ అని పేరు వచ్చింది మాత్రం రాధిక,రాధా, సుమలత,మాధవి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అయితే వీరందరి విషయం పక్కన పెడితే.. రాధిక చిరంజీవి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ రాధికకు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చిరంజీవి అంటే అస్సలు పడేది కాదట.ఇక చిరంజీవి సినిమాల్లోకి రాకముందే రాధిక హీరోయిన్ గా స్టార్ స్టేటస్ తెచ్చుకుందట. దాంతో కాస్త ఈగో చూపించేదట.కానీ చిరంజీవికి అది అస్సలు నచ్చేది కాదట. దాంతో వీరిద్దరి మధ్య షూటింగ్ సెట్లోనే చాలాసార్లు చిన్న చిన్న గొడవలు జరిగేవట. కానీ అంత గొడవ పడ్డా కూడా ఓసారి చిరంజీవి పరువు కాపాడిందట రాధిక. మరి ఇంతకీ ఆ సినిమా షూటింగ్లో ఏం జరిగింది? ఎప్పుడు దెబ్బలాడుకునే రాధిక చిరంజీవిలు ఆ సినిమాతో ఎలా కలిసిపోయారు అనేది ఇప్పుడు చూద్దాం..

 చిరంజీవి రాధిక కాంబినేషన్లో వచ్చిన అభిలాష సినిమా ఇప్పటి ప్రేక్షకులు చూడకపోయినప్పటికీ అప్పటి జనరేషన్ ప్రేక్షకులు ఈ సినిమా చూసే ఉంటారు.అయితే ఈ సినిమా లో ఓ సన్నివేశం కోసం చిరంజీవి ఎత్తైన ప్రాంతం నుండి దూకే సీన్ ఉంటుందట. అయితే ఈ సీన్ చిత్ర యూనిట్ కాస్త దూరం నుండి చిత్రీకరిస్తున్నారట.దఇక అప్పుడే ఎత్తు ప్రదేశం నుండి దూకిన చిరంజీవి ప్యాంటు బటక్ దగ్గర చిరిగిపోయిందట.దాంతో అది గమనించిన చిరంజీవి వెంటనే రాధిక దగ్గరికి వెళ్లి ప్లీజ్ రాధిక నా ప్యాంటు చిరిగిపోయింది. ఇప్పుడు అక్కడికి ఎలా రావాలి.. మీరు మీ చీర కొంగుతో నా ప్యాంటు కాస్త కవర్ చేయండి.

 లేకపోతే అక్కడిదాకా నడుచుకుంటూ రాలేను అని అడిగారట. దాంతో ఎప్పుడు నిప్పు ఉప్పులా ఉండే రాధిక సరేనని చెప్పి రాధిక ముందు నడుస్తూ ఉంటే చిరంజీవి వెనకాల నడుచుకుంటూ వచ్చారట. అలా ఆరోజు చిరంజీవి పరువు కాపాడిందట రాధిక. అయితే షూటింగ్ సెట్ లో ఎప్పుడూ దెబ్బలాడుకునే వీళ్ళు ఇలా కలిసిపోయారేంటి అని ఆ టైంలో చాలామంది ఆశ్చర్యపోయారట. కానీ ఆ తర్వాత అసలు విషయం చెప్పడంతో అందరూ నవ్వుకున్నారట. ఇక ఈ సంఘటన జరిగినప్పటినుండే రాధిక చిరంజీవిల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: