
అదే విధంగా సినిమా ఇండస్ట్రీ నుంచి అతి కొద్ది సెలబ్రిటీలకు మాత్రమే ఆహ్వానం అందింది .. బాలకృష్ణతో అఖండ వన్ 2 , వీరసింహారెడ్డి భగవాంత్ కేసరి , డాకు మహారాజ్ నిర్మాతలకు , దర్శకులకు మాత్రమే ఆహ్వానం అందింది . ఈ పార్టీలో వీరు మాత్రమే కనిపించారు .. అలాగే ఎంతోమంది ఆహ్వానితులు అక్కడ ఉన్న అందరూ ఏదో విధంగా నారా - నందమూరి కుటుంబంతో చిన్న బంధుత్వం ఉన్నవారు తప్ప వేరే వారు ఎక్కడ కనిపించలేదు .. అక్కడికి వెళ్లిన వాళ్ళు చాలామంది బాలకృష్ణను అభినందించి అక్కడి వారితో కలిసి మలిసి కబుర్లు చెబుతు చాలాసేపు గడిపారు ..
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో గాని తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కానీ .. నారా - నందమూరి పార్టీ గురించి ఎంతో హాట్ టాపిక్ గా మారింది .. ఇక మరి త్వరలోనే టాలీవుడ్ లో కూడా బాలయ్యను గ్రాండ్గా సన్మానించడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా బాలకృష్ణకు ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి .. త్వరలోనే వీటికి సంబంధించిన అధికార ప్రకటనలు కూడా రానున్నాయి.