దీపిక పదుకొణె నా అభిమాన నటి. తన స్ఫూర్తితో నేను సినిమాల్లో నటించాలనుకున్న. ఇంట్లో ఆ విషయం చెబితే ' ముందు చదువు... తర్వాత సినిమాల్లో నటించొచ్చు అని అన్నారు. చదువులో నేను ముందుండెదాన్ని. ఎంబీఏ అయ్యాక నాన్న తన వ్యాపారాల్లో నన్ను బాగా చేయాలనుకున్నారు. హీరోయిన్ అవ్వాలని నేను ఆశపడటంతో ఆ దిశగా ప్రోత్సహించారు. అందుకే చదువుకుంటూనే బాలె, బెల్లీ, హిప్ హాప్ డాన్సులు నేర్చుకున్న. అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుని ముంబై వెళ్లి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టా. ఫోటోలు పట్టుకుని సినిమా ఆఫీసుల వెంట తిరిగే దాన్ని.
అడ్మిషన్లకు హాజరయ్యేదాన్ని. చాలామంది అవకాశం ఇవ్వకపోగా పదేపదే తిప్పించుకునేవారు. చివరికి హీరోయిన్ గా అయ్యాను. నాకు హారర్ చిత్రాలు అంటే భయం. ఎప్పుడు అలాంటి సినిమాలని ఒంటరిగా చూడలేదు. ఎప్పటికీ ఆ ధైర్యం చేయలేను. ' ది రాజాసాబ్' హరర్ నేపథ్యమున్నదే. భయపెట్టే ఆ ఆ సినిమాలో నాది వైవిధ్యభరితమైన పాత్ర. చాలా కొత్తగా అనిపించింది. నాలాగా భయపడేవాళ్ళు... తప్పనిసరిగా కుటుంబ సభ్యులతో కలిసే ఆ సినిమాను చూడండి. నిది అగర్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు, ఆమె ఫ్యాషన్ మరియు బ్యూటీ ట్రైన్స్ గురించి పోస్టులు చేస్తారు. సోషల్ మీడియాలో ఎక్కువ ఆక్టివ్ గా ఉంటారు.