మన భారతీయ చలనచిత్ర చరిత్రలో ఎంతో గొప్ప ఆదరణ పొందిన గాయకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు ఉదిత్ నారాయ‌ణ .. ఈయన దక్షిణాది సంగీత ప్రియులకు కూడా ఎంతో సుపరిచితుడు.. 90ల‌ చివరలో చిరంజీవి హీరోగా వచ్చిన చూడాలని ఉంది సినిమాలో రామ చిలకమ్మ పాటతో తెలుగు సంగీత ప్రియులను ఒక ఊపు ఊపేశారు ఆ తర్వాత ఒక దశాబ్దం పాటు ఎన్నో పాటలు ప‌డి ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. హిందీలో కూడా ఒక రెండు దశాబ్దాల పాటు అగ్ర సింగర్ గా కొనసాగిన ఉదిత్ .. ఈ మధ్య కాస్త లైమ్‌ లైట్ కు దూరమయ్యాడు ..


అయితే రీసెంట్ గానే అమెరికా వేదికగా ఆయన ఒక మ్యూజికల్ ఈవెంట్లో పాల్గొన్నారు .. ఇక ఇందులో అభిమానంతో తన దగ్గరికి వచ్చిన మహిళ అభిమానులకు ఆయన ఘాటు ముద్దులు ఇవ్వటం తీవ్ర వివాదాస్పదంగా మారింది .. ఒక మహిళా తాను ముద్దు పెట్టక ఆయన ఆమెకు పెదవి ముద్దు పెట్టేసాడు. ఆ తర్వాత అతనితో సెల్ఫీ కోసం వచ్చిన అమ్మాయిలందరికీ ముద్దులు పెట్టేసాడు .. ఇలా పిలిచి మరీ లేడీ ఫ్యాన్స్ కు ముద్దులు ఇవ్వడంతో పెద్ద దుమారం రేగింది .. కొంచెం లేటుగా సోషల్ మీడియాలోకి వచ్చిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది .. అలాగే ఉరిత్ నారాయ‌ణ్ పై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో దీనిపై ఉదిత్ స్పందించాడు .. తాను చేసిన తప్పు పనికి బేస్ షరతుగా క్షమాపణ చెప్పేస్తే ఓ పని అయిపోయేది.. కానీ ఆయన మాత్రం తన చర్యలను సమర్థించుకుంటూ వచ్చాడు.


అమెరికాలో కొన్ని రోజులు ముందు జరిగిన ఈవెంట్ కు సంబంధించిన వీడియోలను ఇప్పుడు ఎందుకు వైరల్ చేసి వివాదం చేస్తున్నారని .. ఇదంతా తనపై కుట్రపూర్తంగా కొందరు దుష్ప్రచారం చేయడంలో భాగమని ఆయన ఆరోపించారు .. అలాగే ఈ వీడియోను చెడు దిష్టితో చూస్తున్నారని .. తన‌కు తన అభిమానులకు మధ్య లోతైన తెగిపోని స్వచ్ఛమైన బంధం ఉందని తమ మధ్య ఉన్న ప్రేమనే ఈ వీడియోలో చూశారని ఆయన అన్నాడు. అలాగే ఎవరైనా ఇందులో చెడును చూస్తుంటే వాళ్లకు సారీ అని .. కానీ తనకు ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవని ఉదిత్ చెప్పుకొచ్చాడు .. అలాగే తన పేరును చెడగొట్టడానికి కొందరు ఇలా చేస్తున్నారని కానీ తనను ఎంత కిందకి లాకితే అంత పైకి లేస్తారని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: