గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజ‌ర్ సినిమాతో  ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ షాక్ ఇచ్చాడు .. శంకర్ దర్శకత్వంలో భారీ అంచ‌న‌లతో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులకు కోలుకోలేని దెబ్బ కొట్టింది .. త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న మూవీ కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు .. కానీ సినిమా రిలీజ్ తర్వాత అంతా తార్మారైంది.. సినిమా అనుకూనంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది .. ఇక ఇప్పుడు రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు .. ఒకే ఒక్క సినిమాతో స్టార్ దర్శకుడుగా క్రేజ్‌ తెచ్చుకున్నాడు బుచ్చిబాబు..


క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్గా పని చేసిన తర్వాత దర్శకుడుగా మారాడు .. మొదటి సినిమా ఉప్పెన తోనే టాలీవుడ్లో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు .. మెగా హీరో వైష్ణవ తేజ్ , కృతి శెట్టి ఇండస్ట్రీకి ఈ మూవీ తోనే పరిచయమయ్యారు .. అలాగే విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా నటించారు. అయితే ఉప్పెన సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బుచ్చిబాబు ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారు .. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ డ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది.


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి .. రామ్ చరణ్ గేమ్ చేంజర్ హడావిడి కూడా పూర్తవడంతో ఇప్పుడు బుచ్చిబాబు సినిమాపై ఫోకస్ పెట్టాడు మెగా పవర్ స్టార్ .. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైర్లుగా మారింది .. ఈ సినిమా రంగస్థలం సినిమా అలాగా గ్రామీణ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది .. అంతేకాకుండా ఈ సినిమాలో చరణ్ గుడ్డివాడిగా నటిస్తున్నాడని కూడా టాక్ వినిపిస్తుంది .. ఇక రంగస్థలం సినిమాలో చరణ్ చెవిటి వాడి పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు .. ఇక ఇప్పుడు ఈ సినిమాలో గుడ్డివాడిగా కనిపిస్తాడని కూడా అందరూ అంటున్నారు మరి ఈ వార్తల్లో ఎంతవరకు  నిజముంది అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: