పాన్ ఇండియ‌ హీరో ప్రభాస్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో మిర్చి కూడా ఒకటి .. స్టార్ దర్శకుడు కొరటాల శివ మొదటిసారిగా దర్శకత్వం వహించిన ఈ సినిమా 2013 ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది .. ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా అనుష్క , రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లుగా నటించారు .. అలాగే ఈ సినిమాలో సినియ‌ర్ న‌టి నదియా , సత్తిరాజ్ కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది .. అయితే ఈ సినిమాలో రిచా గంగోపాధ్యాయ్ సెకండ్ హీరోయిన్గా న‌టించింది .. అంతకుముందు రానా లీడర్ సినిమాలో నటించింది ..


తెలుగులో పలు సినిమాలో నటించిన‌ రీచా .. తర్వాత ఊహించిన విధంగా సినిమాలకు దూరమైంది .. ప్రస్తుతం తన ఫ్యామిలీ లైఫ్ తో తన కొడుకుతో కలిసి హ్యాపీగా జీవిస్తుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల  దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది రీచా.. ఈ సినిమాలో రానాకు జంటగా కనిపించి మెప్పించింది పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా మంచి విజయ అందుకుంది .. అయితే అనుకున్నంతగా కలెక్షన్లు మాత్రం అందుకోలేకపోయింది .. ఆ తర్వాత రవితేజ కిరాక్ వచ్చిన మిరపకాయ సినిమాలో హీరోయిన్గా నటించింది ఈ రెండు సినిమాలు కాకుండా ప్రభాస్ కు జంటగా మిర్చి సినిమాతో బాగా క్రేజ్ తెచ్చుకుంది ..


సినిమా తర్వాత రీచాకు తెలుగులో వరుస అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు కానీ .. ఆ తర్వాత నాగవల్లి , బాయ్ సారొచ్చారు వంటి సినిమాల్లో మాత్రమే ఈమె నటించింది. వరుస సినిమాల్లో నటిస్తూ ఉండగానే తన స్నేహితుడు జో లాంగెల్లాను ప్రేమించి పెళ్లి చేసుకుంది .. 2019లో వీరు పెళ్లి చేసుకోగా.. 2021 లో వీరికి  లూకా షాన్ లాంగెల్లా అనే బాబు జన్మించాడు .. అటు రిచా  సోషల్ మీడియాలో కూడా అంత‌గా యాక్టివ్ గా ఉండదు .. అయితే ప్రస్తుతం ఈ సీనియర్ బ్యుటీకి సంబంధించిన కొన్ని ఫోటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈమె ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని వార్తలు మరో సరి బయటకు వచ్చాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: