ఇక 2021 లో వచ్చిన సెకండ్ షో సినిమాతో దుల్కర్ తన సినీ జీవితాన్ని మొదలుపెట్టాడు .. ఆ తర్వాత వచ్చిన ‘ఉస్తాద్ హోటల్’ సినిమాతో మలయాళ ప్రేక్షకుల మదిలో చెరగపోని స్థానం తెచ్చుకున్నాడు . ఆ తర్వాత మళయాలం , తమిళం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించాడు .. అలాగే తన సినిమాల్లో సహజమైన నటనతో అభిమానుల గుండెల్లో చెరగపోని స్థానం తెచ్చుకున్నాడు ఈ మలయాళీ హీరో .. అయితే ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ మరోసారి టాలీవుడ్ దర్శకుడితో ఓ భారీ సినిమా చేయబోతున్నాడు ..
అయితే దుల్కర్ టాలీవుడ్ డెబ్యూ డైరెక్టర్ రవి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు .. ఇక ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మించబోతున్నటు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో దుల్కర్ కు జంటగా టాలీవుడ్ హీరోయిన్ పూజ హెగ్డే హీరోయిన్గా నటించబోతుందని టాక్ బయటికి వచ్చింది .. చాలాకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న పూజా ఇప్పుడే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది .. ఇప్పుడిప్పుడే కొత్త సినిమాలకు ఓకే చెబుతుంది ఇప్పుడు దుల్కర్ సల్మాన్ కు జంటగా నటించబోతుందనే వార్తలు బయటకు వస్తున్నాయి .
View this post on InstagramA post shared by pooja hegde (@hegdepooja)