టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో సందీప్ కిషన్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు చాలా సినిమాలలో హీరోగా నటించాడు. కానీ ఈయనకు కొన్ని సినిమాల ద్వారా మాత్రమే మంచి విజయాలు దక్కాయి. ఇకపోతే తాజాగా ఈయన త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో ధమాకా అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో రీతూ వర్మ హీరోయిన్గా నటించగా ... రావు రమేష్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథను అందించాడు.

ఇకపోతే ఈ సినిమాను చాలా కాలం క్రితం ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను సంక్రాంతికి మాత్రం విడుదల చేయలేదు. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను ఫిబ్రవరి 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ ని ఈ నెల 21 వ తేదీన కూడా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ లేనట్లు , ఈ మూవీ ని ఈ నెల 26 వ తేదీన విడుదల చేసే ప్లాన్స్ మేకర్స్ వేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇప్పటి వరకు ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసి ఫిబ్రవరి 21 వ తేదీన కాకుండా ఫిబ్రవరి 26 వ తేదీన విడుదల చేస్తారా ..? లేదా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk