సినిమా ఇండస్ట్రీ లో ఓ కాంబోలో సినిమా వచ్చి అది అద్భుతమైన విజయం సాధించింది అంటే మరో సారి ఆ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఇకపోతే కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి "వాల్టేరు వీరయ్య" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. 2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ సంవత్సరం ఈ మూవీ సంక్రాంతి విన్నర్ గా కూడా నిలిచింది. ఈ మూవీ తో బాబీ కి దర్శకుడిగా మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఇకపోతే మరో సారి ఈ క్రేజీ కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా , శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండు మూవీ లు పూర్తి అయిన తర్వాత బాబీ దర్శకత్వంలో చిరంజీవి మరో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా వాల్టేరు వీరయ్య తర్వాత చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో మైత్రి సంస్థలో మరో మూవీ రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. తాజాగా బాబి బాలకృష్ణ హీరో గా డాకు మహారాజు అనే సినిమాను రూపొందించాడు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా బాబి క్రేజ్ మరింతగా పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: