టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్లను డబ్బులు ఆడుతున్నారట. అయితే... శ్రీ రెడ్డి పేరుతో ఉన్న టెలిగ్రామ్ అకౌంట్ ను చూసి... కొంత మంది ఫ్యాన్స్ ఆమెకు ఆర్థిక సహాయం చేశారట. అయితే ఈ విషయం శ్రీ రెడ్డికి తాజాగా తెలిసింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన శ్రీ రెడ్డి... అది ఫేక్ అంటూ క్లారిటీ ఇచ్చింది. తన పేరుతో.. కొంతమంది వెధవలు... డబ్బులు వసూలు చేస్తున్నారని.. పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. టెలిగ్రామ్ లో జరిగిన తప్పిదాన్ని... తన అధికారిక సోషల్ మీడియా వేదికగా పంచుకుని... తన అభిమానులను అలెర్ట్ చేసింది.
తన పేరుతో ఉన్న ఫేక్ టెలిగ్రామ్ అకౌంట్లో ఎవరు కూడా డబ్బులు వేయకూడదు అని కూడా రిక్వెస్ట్ చేసింది శ్రీరెడ్డి. ఓ వ్యక్తి 200 రూపాయలు పంపిన స్క్రీన్ షాట్ కూడా పెట్టింది. అనవసరంగా ఇలా ఫేక్ అకౌంట్ ల ద్వారా మెసేజ్లు వస్తే స్పందించకూడదని తెలిపింది. దీంతో ఈ సంఘటన వైరల్ గా మారింది. అయితే వెంటనే అలర్ట్ శ్రీరెడ్డి తన ఫ్యాన్స్ కు రిక్వెస్ట్ చేయడంతో.. ఆమె మంచి మనసును అందరు మెచ్చుకుంటున్నారు.
ఇది ఇలా ఉండగా... వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత శ్రీరెడ్డికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆమెపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చాలా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయి. టిడిపి కూటమి నేతలను... సోషల్ మీడియాలో తిట్టినందుకుగాను... ఆమెపై రకరకాల కేసులు పెట్టారు కూటమి నేతలు. దీంతో ఆమె ఆంధ్రప్రదేశ్ ను వదిలి... హైదరాబాదులోనే తలదాచుకుందని సమాచారం. అలాగే అప్పుడప్పుడు.. బెంగళూరు వెళ్లి కూడా ఉంటుందట. అయితే దీనిపై ఇంకా క్లారిటీ లేదు.