తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో త్రినాథ్ రావు నక్కిన ఒకరు. ఇప్పటి వరకు ఈయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలతో మంచి విజయాలను అందుకొని దర్శకుడి గా తనకంటూ ఒక మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు. ఇకపోతే త్రినాధ్ రావు నక్కిన ఆఖరుగా మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా ధమాకా అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథను అందించాడు.

ఇకపోతే తాజాగా త్రినాథ్ రావు నక్కిన , ప్రసన్న కుమార్ బెజవాడ అందించిన కథతో సందీప్ కిషన్ హీరోగా రీతూ వర్మ హీరోయిన్గా మజాకా అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ని ఫిబ్రవరి 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా నుండి మేకర్స్ ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్ని కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దానితో ఈ మూవీ కి నైజాం మరియు సీడెడ్ ఏరియాలో అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి నైజాం ఏరియాకు గాను 4.05 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ సీడెడ్ ఏరియా హక్కులు 1.80 కోట్లకి అమ్ముడు పోయినట్లు తెలుస్తుంది. సందీప్ కిషన్ సినిమాల్లో సీడెడ్ ఏరియాలో ఇదే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన సినిమా ఇదే అని తెలుస్తుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 21 వ తేదీన కాకుండా 26 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk