విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల అయిన 18 వ రోజు కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర వసూలు చేసింది. విడుదల అయిన 18 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో సంక్రాంతికి వస్తున్నాం సినిమా అద్భుతమైన స్థానంలో నిలిచింది.

విడుదల అయిన 18 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో పుష్ప పార్ట్ 2 మూవీ 3.51 కోట్ల కలెక్షన్లతో మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా , కల్కి 2898 AD సినిమా 2.84 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలోనూ , బాహుబలి 2 సినిమా 2.60 కోట్ల తో మూడవ స్థానం లోనూ , అత్తారింటికి దారేది 2.06 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలోనూ , బాహుబలి పార్ట్ 2 సినిమా 1.45 కోట్లతో ఐదవ స్థానంలోనూ , మహర్షి సినిమా 1.40 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానంలోనూ , దేవర పార్ట్ 1 సినిమా 1.37 కోట్ల కనెక్షన్లతో ఏడవ స్థానంలోనూ , గీత గోవిందం సినిమా 1.34 కోట్ల కలెక్షన్లతో ఎనిమిదవ స్థానంలోనూ , హనుమాన్ సినిమా 1.17 కోట్ల కలెక్షన్లతో 9 వ స్థానంలోనూ , తమిళ డబ్బింగ్ సినిమా జైలర్ మూవీ 1.11 కోట్ల కలెక్షన్లతో పదవ స్థానంలోనూ , రంగస్థలం సినిమా 1.06 కోట్ల కలెక్షన్లతో 20 వ స్థానంలోనూ , తమిళ డబ్బింగ్ సినిమా ఆమరన్ సినిమా 05 కోట్ల కలెక్షన్లతో 11 వ స్థానంలోనూ , సంక్రాంతికి వస్తున్నాం సినిమా 1.01 కోట్ల కలెక్షన్లతో 12 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: