యుజ్వేంద్ర చాహల్ ఇప్పుడు ట్రెండింగ్‌ టాపిక్‌. చాలా కాలం నుంచి టీమ్ ఇండియాకు దూరమైనటువంటి స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ప్రస్తుతం యుజ్వేంద్ర చాహల్ వ్యక్తిగత జీవితం అయోమయంలో పడింది. చాహల్ కు తన భార్య ధన శ్రీ వర్మతో విభేదాలు కొనసాగుతున్నాయని విపరీతంగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. దాంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.


అంతేకాకుండా ధనశ్రీ వర్మకు సంబంధించిన ఫోటోలను చాహల్ తన సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశాడు. దీంతో అప్పటినుంచి వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వీరి విడాకుల వార్తల పైన చాహల్, ధన శ్రీ వర్మ అసలు స్పందించలేదు. ఈ మధ్యకాలంలో యుజ్వేంద్ర చాహల్ ఓ అమ్మాయితో కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ అమ్మాయితో బయటకి వెళ్లిన సమయంలో కెమెరా కంట పడ్డాడు.


ఆ సమయంలో చాహల్ తన ముఖాన్ని దాచుకున్నటువంటి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై ఎలాంటి క్లారిటీ రాకముందే చాహల్, ధనశ్రీ వర్మ విడాకుల భరణం కి సంబంధించి ఓ వార్త వైరల్ గా మారుతుంది. భరణం కింద యుజ్వేంద్ర చాహల్ భార్య ధన శ్రీ వర్మ దాదాపుగా రూ. 60 కోట్లు తీసుకుందని ప్రచారాలు జరుగుతున్నాయి.


ప్రస్తుతం వీరి విడాకుల విషయం కోర్టులో ఉండడం వల్లనే ఈ వార్తలపై వీరిద్దరూ స్పందించడం లేదని సమాచారం అందుతోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు, భరణానికి సంబంధించిన వార్తలు విపరితంగా వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై యుజ్వేంద్ర చాహల్, ధన శ్రీ వర్మ ఎవరో ఒకరు స్పందిస్తే గాని అసలు విషయం తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: