పూజ హెగ్డే సౌత్ లో పూర్తిగా సినిమాలు తగ్గించేసి పూర్తిగా బాలీవుడ్ లోనే కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ కి ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ ప్రశ్న ఎదురయింది. ఇక ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ చిర్రెత్తుకొచ్చిన హీరోయిన్ జర్నలిస్ట్ పై ఫైర్ అయింది.మరి ఇంతకీ పూజ హెగ్డే కి కోపం తెప్పించేలా ఆ జర్నలిస్టు ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం. షాహిద్ కపూర్ పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా బాలీవుడ్లో దేవా అనే మూవీ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా జనవరి 31న గ్రాండ్గా విడుదలైంది.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు పూజ హెగ్డే షాహిద్ కపూర్. ఇక ఆ ప్రెస్ మీట్ లో భాగంగా ఎంతోమంది జర్నలిస్ట్ లు ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. వాటికి హీరోయిన్ హీరో ఇద్దరు ఆన్సర్లు ఇచ్చారు. అయితే ఓ విలేకర్ మాత్రం పూజ హెగ్డే సహనాన్ని పరీక్షించారు.

 ఆయన మొదట లేచి మీకు ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి.ఆ సినిమాలకు మీరు అర్హులేనా.. మీరు సల్మాన్ ఖాన్,రణవీర్ సింగ్,షాహిద్ కపూర్,హృతిక్ రోషన్ ల సినిమాల్లో చేస్తున్నారు.. అంటూ కోపం తెప్పించారు. ఇక ఈయన మాటలకు చాలా ఓపిగ్గా సమాధానం ఇచ్చింది పూజ హెగ్డే.. నన్ను స్టార్ హీరోల సినిమాల్లో డైరెక్టర్లు తీసుకోవడానికి ఒక కారణం ఉంటుంది. అలాగే ఆ హీరోల సినిమాల్లో నటించడానికి నేను అర్హురాలిని కాబట్టే నన్ను ఆ సినిమాల కోసం తీసుకుంటున్నారు. నాకు ఏ పాత్ర వచ్చినా ఆ పాత్రకి 100% న్యాయం చేస్తాను. కానీ మీరు దాన్ని అదృష్టం అంటే మీ ఇష్టం అనుకోండి అంటూ సమాధానం ఇచ్చింది.

 ఆ తర్వాత మళ్లీ అదే జర్నలిస్టు లేచి మీరు స్టార్ హీరోల సినిమాల్లో అయితేనే నటిస్తారా.. సినిమాలను ఎలా ఎంచుకుంటారు అంటూ చిరాకు తెప్పించారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన పూజ హెగ్డే అసలు మీ ప్రాబ్లం ఏంటండి.. ఏం సమాధానం కోసం నన్ను ఈ ప్రశ్నలు అడుగుతున్నారు అంటూ ఫైర్ అయ్యింది. అయితే గొడవ అయ్యేలా ఉంది అని గమనించిన షాహిద్ కపూర్ వెంటనే దాన్ని డైవర్ట్ చేసి బహుశా ఆయనకు నువ్వు చేసే స్టార్ హీరోలు అంటే ఇష్టం కావచ్చు.వారితో సినిమాలు చేయాలనుకుంటున్నాడు కావచ్చు. అందుకే నువ్వు వారితో స్క్రీన్ షేర్ చేసుకున్నావు కదా నీ సలహాలు పాటించాలి అనుకుంటున్నాడు కావచ్చు అంటూ టాపిక్ డైవర్ట్ చేశారు. ప్రస్తుతం పూజా హెగ్డే ని జర్నలిస్టు ప్రశ్నించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది

మరింత సమాచారం తెలుసుకోండి: