తెలుగు రాష్ట్రాల తరఫున హీరో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వరించడం విశేషం. సినిమా ఇండస్ట్రీలో దాదాపు 50 సంవత్సరాలుగా అతను చేస్తున్న సేవలకు గాను బాలయ్య బాబును పద్మభూషణ్ అవార్డుతో సత్కరించబోతున్నారు. తాతమ్మ కళ సినిమాతో బాల నటుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరో తన కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తూ దాదాపు 100కు పైగా సినిమాలలో నటించారు. బాలయ్య బాబుకి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది. 


సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. అంతేకాకుండా బాలయ్య రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటారు. ప్రజలకు తనదైన సేవలను అందిస్తూ ఉంటారు.  కాగా.... బాలయ్య బాబుకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సంతోషంలో తన అన్నయ్య బాలకృష్ణ ఇంత గొప్ప ఘనతను సాధించినందుకు గాను తన చెల్లెలు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి నిన్న గ్రాండ్ గా ఓ పార్టీని ఏర్పాటు చేశారు.


హైదరాబాద్ నగర శివారులో ఉన్న చంద్రబాబు ఫామ్ హౌస్ లో ఈ పార్టీ ఘనంగా జరిగినట్టుగా సమాచారం అందుతుంది. నారా నందమూరి కుటుంబ సభ్యులు ఈ పార్టీకి హాజరు కావడం విశేషం. ఇరు కుటుంబాలకు సంబంధించిన వారితో పాటు వారికి అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా హాజరైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ బాలయ్యతో పనిచేసి వరుస హిట్లు అందుకున్న తమన్ కూడా ఆ పార్టీకి రావడం విశేషం.


ఈ పార్టీకి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి తమన్ ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ లో షేర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశాడు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. కాగా, ఈ పార్టీకి సంబంధించి మరి కొన్ని ఫోటోలు బయటకు రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: