హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినీ అభిమానులు ఈ బ్యూటీని ఎంతగానో ఆదరిస్తారు. ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ హనీ రోజ్ కి పెద్దగా గుర్తింపు రాలేదు. కేవలం ఒకే ఒక సినిమాతో ప్రతి ఒక్కరి చూపును తన వైపుకు పడేలా చేసుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా చేసిన వీర సింహారెడ్డి సినిమాలో ఈ బ్యూటీ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించారు.


అందులో బాలయ్యకు జోడిగా హనీ రోజ్ నటించింది. ఈ బ్యూటీ అందానికి, నటనకు ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. ఆ సినిమా అనంతరం ఈ బ్యూటీకి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. అంతేకాకుండా పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించింది. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని భారీగా డబ్బులు సంపాదించింది. కాగా, హనీ రోజ్ 2005లో మలయాళం సినిమాతో వెండితెరకు పరిచయమైంది.


ఆ తర్వాత తెలుగులో వరుణ్ సందేశ్ తో 2014లో ఈ వర్షం సాక్షిగా అనే సినిమాలో నటించింది. అయితే హనీ రోజ్ చేసిన ఈ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. కానీ బాలకృష్ణతో చేసిన సినిమా మాత్రం భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ మధ్యకాలంలో హనీ రోజ్ కి సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. సోషల్ మీడియాలో తన అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.


తన అందాలను ఆరబోసి ఫోటోషూట్లు చేస్తుంది. కాగా, ఈ బ్యూటీకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. హనీ రోజ్ తనకన్నా తక్కువ వయసున్న అబ్బాయితో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తుందట. అతని వయసు కేవలం 23 సంవత్సరాలు కావడంతో ప్రతి ఒక్కరూ ఈ విషయంపై నెగిటివ్ గా స్పందిస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: