మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరో . కేవలం టాలీవుడ్ జనాలకి మాత్రమే కాదు బాలీవుడ్ జనాలకి సైతం మహేష్ బాబు నటించిన సినిమాలు చాలా నచ్చేస్తూ ఉంటాయి.  మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని రోల్స్ కి మహేష్ బాబు ది పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు అని అంతా అంటూ ఉంటారు . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మహేష్ బాబు పేరు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతూ మారుమ్రోగిపోతుందో మనందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమా కమిట్ అయ్యాడు మహేష్ బాబు అని తెలియగానే ఇండస్ట్రీలో ఆయన గురించి మాట్లాడుకునే జనాలు ఎక్కువగా కనిపిస్తున్నారు .

"గుంటూరు కారం"  సినిమా టైంలో ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో అందరికి తెలిసిందే. ఆ ట్రోలింగ్ మొత్తం పాజిటివిటీగా మార్చేసుకున్న మూవీ ఇదే కాబోతుంది మహేష్ బాబుకి అంటూ జనాలు ఆయన గురించి పదే పదే చర్చించుకోవడం ప్రారంభించారు.  కాగా ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ జరుగుతుంది . అయితే త్వరలోనే ఆఫ్రికా అడవుల్లో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ జరపడానికి పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడు రాజమౌళి అంటూ ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది.

రీసెంట్గా ఇప్పుడు సోషల్ మీడియాలో మహేష్ బాబు కి సంబంధించిన ఒక వార్త ఇంట్రెస్టింగ్గా మారింది . మహేష్ బాబు ఎక్కడికి వెళ్తున్నా సరే తన బ్యాగ్ లో ఒకటి మాత్రం కంపల్సరీ పెట్టుకుని ఉంటాడు అన్న విషయం సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.మహేష్ బాబు తన బ్యాగ్ లో కచ్చితంగా బుక్స్ పెట్టుకొని ఉంటాడట . ఎక్కడికి వెళ్తున్నా సరే బుక్స్ క్యారీ చేస్తాడట.  మహేష్ బాబుకి కొంచెం టైం దొరికిన బుక్స్ చదవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారట . ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లే మూమెంట్లో.. ఫ్లైట్లో ..సినిమా షూటింగ్ గ్యాప్ లో ఎక్కువగా అయిన బుక్స్ చదువుతూ ఉంటారట.  అందుకే ఆయన తన బ్యాగ్ లో ఎప్పుడు బుక్స్ ని క్యారీ చేస్తూ వస్తారట . ఈ విషయం తెలుసుకున్న జనాలు ఫుల్ హ్యాపీ గా ఫీల్ అయిపోతున్నారు . దట్ ఇస్ మహేష్ బాబు అంటూ ట్రెండ్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: