కొన్ని కొన్ని సినిమాలకి సీక్వెల్స్ వస్తే బాగుంటుంది అన్న విషయం జనాలు ఎప్పుడూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఆ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కిస్తున్నప్పుడు కచ్చితంగా మొదటి సినిమాకి 100 రెట్లు ఎక్కువగా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటేనే ఆ సినిమాలను తెరకెక్కించాలి అని లేకపోతే సైలెంట్ గా ఉన్న సినిమాను అలాగే వదిలేస్తే బాగుంటుంది అని కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో చాలా సినిమాలకు సీక్వెల్ వచ్చి అట్టర్ ప్లాప్ అయినా సందర్భాలు మనం చూసాం . ఎందుకురా బాబు ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించాము అంటూ డైరెక్టర్స్ కూడా బాధపడిన సందర్భాలు ఉన్నాయి .

అయితే సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని హిట్స్ సినిమాలకి సీక్వెల్ వస్తే బాగుంటుంది అంటూ జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . మరీ ముఖ్యంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన  ఇడియట్ సినిమాకి సీక్వెల్ వస్తే బాగుంటుంది అని ఎప్పటినుంచో రవితేజ ఫాన్స్ ఆశ పడుతున్నారు . అయితే ఇన్నాళ్ళకి ఆ ముహూర్తం కుదిరినట్టు తెలుస్తుంది . సోషల్ మీడియాలో ఒక వార్త హ్యూచ్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇడియట్ 2 సినిమా తెరకెక్కబోతుందట .

దీనికి సంబంధించి బ్యాక్ గ్రౌండ్ లో పూర్తి పనులను చకచకా కంప్లీట్ చేసేస్తున్నాడట పూరి జగన్నాథ్ . అయితే ఈ సినిమాలో హీరోగా రవితేజ మాత్రం తీసుకోవట్లేదట పూరి.  ఆయన ఏజ్ మారిపోయిన కారణంగా ఈ సినిమాలో రవితేజ ప్లేస్ ని సిద్దు జొన్నలగడ్డతో రీప్లేస్ చేయాలి అనుకుంటున్నారట . అదే విధంగా హీరోయిన్గా శ్రీలీల ని అనుకుంటున్నారట . ఒకవేళ ఈ కాంబో సెట్ అయితే మాత్రం కెవ్వు కేక అనే చెప్పాలి . రచ్చ రంబోలా చేసేయచ్చు అంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా చూపులతో గుచ్చి గుచ్చి సాంగ్ లాంటి సాంగ్ మరొకసారి థియేటర్లో చూడగలిగితే ఆ కిక్కే వేరు అంటూ పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ప్రశంసిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం రవితేజ నే ఈ సినిమాలో నటిస్తే బాగుంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు . చూడాలి మరి పూరి జగన్నాథ్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో..? దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది..!
 

మరింత సమాచారం తెలుసుకోండి: