రష్మిక మందన్నా.. ఏ ముహూర్తాన ఇండస్ట్రీలోకి హీరోయిన్ అడుగుపెట్టిందో తెలియదు కానీ అప్పటినుంచి సినిమా ఇండస్ట్రీ మొత్తం తన వైపే తిప్పేసుకుంది . చలో సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని స్టార్ హీరోలకి మించిన రేంజ్ లో ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది . అంతేకాదు ఇప్పుడు రష్మిక మందన్నా అంటే ఓ పాన్ ఇండియా హీరోయిన్ . పెద్ద పెద్ద డైరెక్టర్లు ఆమెకు సినిమా కథలను చెప్పాలి అంటే ఆమె అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే .

అంతే కాదు ఆమె అడిగిన రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే . అలాంటి స్థాయికి ఎదిగిపోయింది రష్మిక మందన్నా. కాగా రష్మిక మందన్నా రీసెంట్గా పుష్ప2 సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు మరిన్ని మంచి మంచి సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి . అయితే పుష్ప2 సినిమా లెవెల్ లో ఆమెకి ఆఫర్ రావాలి అంటే అది కచ్చితంగా ఒక పాన్ ఇండియా సినిమానే అయి ఉండాలి.  కాగా పుష్ప2 సినిమాను మించిపోయే రేంజ్ లో ఉండే సినిమాకు సైన్ చేసింది రష్మిక మందన్నా అంటూ ఓ రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నాయి .

మనకు తెలిసిందే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 సినిమా తెరకెక్కాలి. అయితే ఈ సినిమాలో ఆల్రెడీ హీరోయిన్గా శృతిహాసన్ సెలెక్ట్ అయింది . కాగా ఇప్పుడు రెండో హీరోయిన్ గా రష్మిక సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ప్రభాస్ సరసన రష్మిక నటిస్తే చూడాలి అంటూ ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఇన్నాళ్లకు ఆ కోరిక తీరబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . చూద్దాం మరి ఇది కేవలం వైరల్ అయ్యే వార్త నా లేకపోతే నిజంగానే ఈ మూవీలో హీరోయిన్  గా రష్మిక సెలెక్ట్ అయిందా? తెలియాలి అంటే సినిమా టీం నుంచి ఎవరైనా స్పందించాల్సిందే..!


మరింత సమాచారం తెలుసుకోండి: