టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సైతం పద్మభూషణ్ అవార్డుని ప్రకటించింది.. ఈ విషయం పైన అటు నందమూరి కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేకమైన పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి సైతం బాలయ్య కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఇందులో ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యి బాలయ్యను పొగడ్తలతో ముంచేశారు. అలాగే బాలయ్య గురించి మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.


చంద్రబాబు మాట్లాడుతూ.. ఒకవైపు బాలయ్య మరొకవైపు భువనేశ్వరి ఉన్నారు. వీరిద్దరూ చాలా పవర్ ఫుల్ వీరిమధ్య ఉండడం చాలా ప్రమాదమని.. నిన్నటి వరకు అల్లరి బాలయ్యగా ఉన్న ఇప్పుడు పద్మభూషణం బాలయ్యగా మారిపోయారు.. బాలయ్య దేశం గర్వించదగ్గ గొప్ప బిడ్డ కుటుంబంలో పుట్టారని ఇలాంటి అవార్డు అందుకోవడం ఇదే మొదటిసారి చాలా గర్వంగా ఉందంటూ చంద్రబాబు వెల్లడించారు. అయితే ఇదంతా జస్ట్ బిగినింగ్ మాత్రమే అంటూ పొగడ్తలతో ముంచేశారు. బాలకృష్ణ 1978లో మొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యానని తెలిపారు చంద్రబాబు.


1974లో మొదటి సినిమా బాలయ్య తీశారు. అందుకే తనకంటే బాలయ్య నాలుగేళ్లు సీనియర్ అని వెల్లడించారు. బాలయ్య పైకి అల్లరిగా కనిపించిన లోపల చాలా క్రమశిక్షణమైన వ్యక్తి అని తెలిపారు.కొన్ని సందర్భాలలో ఉదయం 3 గంటలకు నిద్ర లేచి పూజ చేస్తారని అలాంటివి తన వల్ల కావని కూడా తెలిపారు. 50 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఎవరి గ్రీన్ హీరోగా పేరు పొందాలి అంటే అది సాధ్యం కాదని.. క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతలు తీసుకొని ఎంతోమందికి సహాయం చేశారు బాలయ్యను చూస్తే గర్వపడుతున్నానంటూ తెలిపారు. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా కూడా రాజకీయాలలో గెలిచారని ఇంతటి అద్భుతమైన వ్యక్తి తనకు బామ్మర్ది దొరకడం చాలా అదృష్టమంటూ తెలిపారు చంద్రబాబు. ప్రస్తుతం చంద్రబాబు చేసిన ఈ వాక్యాలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: