
అయితే కొన్ని కొన్ని సినిమాల విషయంలో జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలు రాంగ్ గా మారిపోయాయి . ఆయన నటించిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి . ఆ లిస్టులో బోలెడు సినిమాలు ఉన్నాయి . కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం ఓ సినిమా విషయంలో ఫుల్ డిసప్పాయింట్ అయిపోయారు. ఆ సినిమా మరేదో కాదు "ఆంధ్రావాలా". పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించాడు . ఈ సినిమా రిలీజ్ టైం లో ఎంత పెద్ద సెన్సేషనల్ గా మారిపోయాడో జూనియర్ ఎన్టీఆర్ అందరికీ తెలిసిందే .
అయితే ఈ సినిమా మాత్రం అట్టర్ ప్లాప్ గా నిలిచింది . ఆశ్చర్యం ఏంటంటే ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో డిజాస్టర్ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది . ఈ సినిమా అంటే కొంతమంది నందమూరి అభిమానులకు సైతం అస్సలు ఇష్టం ఉండదు . కానీ జూనియర్ ఎన్టీఆర్ అమ్మగారికి షాలినీకి ఈ మూవీ అంటే చాలా ఇష్టమట . ఆమె ఎక్కువగా ఈ సినిమాని టీవీలో చూసి ఎంజాయ్ చేస్తుందట . జూనియర్ ఎన్టీఆర్ నటన ఈ సినిమాలో చాలా వెరైటీగా ఉంటుంది అంటూ ఆమె చెప్పుకొస్తుందట. ఆ కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ అమ్మ గారికి "ఆంధ్రావాలా" సినిమా అంటే సో సో స్పెషల్ . ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది..!