మోక్షజ్ఞ.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పేరు . నందమూరి వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు . మోక్షజ్ఞ రూటే వేరు . ఆయన ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే ఇండస్ట్రీని ఓ రేంజ్ లో అల్లాడించేస్తున్నారు . దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో ఇదిగో మోక్షజ్ఞ ఎంట్రీ అదిగో మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ వార్తలు వినిపిస్తూనే వచ్చాయి . ఒకరు పాన్ ఇండియా సినిమా.. మరొకరు పాన్ ఇండియా స్టార్ మరొకరు పాన్ ఇండియా డైరెక్టర్ ఇలా రకాలుగా వార్తలు వినిపిస్తూ వచ్చాయి.

ఫైనల్లీ ఆ క్రేజీ ఛాన్స్ ప్రశాంత్ వర్మ ఖాతాలో పడింది అంటూ తేలిపోయింది . అయితే రీసెంట్ గా కొన్ని వార్తలు నందమూరి అభిమానులకి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి . బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చే డేబ్యూ మూవీ నుంచి ప్రశాంత్ వర్మ తప్పుకున్నాడు అంటూ ఓ టాక్ వైరల్ గా మారింది . దీనితో మోక్షజ్ఞ కోసం కొత్త డైరెక్టర్ ని వెతికే పనిలో పడ్డాడట బాలయ్య . అయితే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీకి సంబంధించి ఏదో ఒక వార్తలు నెగిటివ్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వచ్చాయి .

ఈ క్రమంలోనే కొంతమంది నందమూరి అభిమానులు మోక్షజ్ఞ అసలు సినిమా ఇండస్ట్రీలో హీరోగా రావడం కన్నా కూడా పొలిటికల్ పరంగా స్టెప్ వేస్తే బాగుంటుంది అంటూ కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు. అదే విధంగా చర్చించుకుంటున్నారు . మోక్షజ్ఞ ఇండస్ట్రీలో హీరోగా వచ్చి సెటిల్ అవ్వడం ఓకే కానీ నాన్న పేరుని అదేవిధంగా తాత పేరుని నిలబెట్టాలి అంటే కచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయడమే బెటర్ ఆప్షన్ అంటున్నారు . మరి దీనిపై బాలకృష్ణ అదే విధంగా మోక్షజ్ఞ ఎలాంటి ఒపీనియన్ లో ఉన్నారు తెలియడం లేదు . చూడాలి మరి మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుకుంటారో..లేక ఫ్యాన్స్ సొల్యూషన్స్ మేరకు పాలిటిక్స్ లో ఎంట్రీ ఇస్తాడో..?

మరింత సమాచారం తెలుసుకోండి: