నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా బాలకృష్ణ డాకు మహారాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రస్తుతం కూడా ధియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇకపోతే బాలయ్య ఇప్పటికే తన తదుపరి ఏడు సినిమాలకు సంబంధించిన లైనప్ ను పక్కగా సెట్ చేసి పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఆ సినిమాలేమిటో తెలుసుకుందాం.

బాలకృష్ణ కొంత కాలం క్రితం అఖండ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆ సినిమాకు కొనసాగింపుగా రూపొందుతున్న అఖండ 2 సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఇక రజనీ కాంత్ హీరోగా రూపొందబోయే జైలర్ 2 మూవీ లో ఓ చిన్న క్యామియో పాత్రలో బాలకృష్ణ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే హిట్ ది ఫోర్త్ కేస్ మూవీ లో కూడా ఓ చిన్న క్యామియో పాత్రలో బాలకృష్ణ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాల తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో , బాబి కొల్లి దర్శకత్వంలో మరో మూవీ లో బాలకృష్ణ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలకృష్ణ కుమారుడు అయినటువంటి మోక్షజ్ఞ డబ్ల్యూ మూవీ లో కూడా బాలకృష్ణ ఓ చిన్న క్యామియో పాత్రలో బాలకృష్ణ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా బాలకృష్ణ నెక్స్ట్ ఈ ఏడు సినిమాల్లో కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే తాజాగా బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజ్ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: