కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో హీరో గా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. విజయ్ ఆఖరుగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (గోట్) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే దళపతి విజయ్ ప్రస్తుతం హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న జన నాయగన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను , టైటిల్ ను మేకర్స్ విడుదల చేశారు. వీటికి మంచి రీజన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఇప్పటికే తలపతి విజయ్ పొలిటికల్ ఓ పార్టీని స్థాపించాడు.

దానితో ఈ సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాల్లో ఉండబోతున్నట్లు ఇదే తన ఆఖరి సినిమాగా ప్రకటించాడు. దానితో ఈ సినిమా ప్రారంభం నుండి ఈ మూవీ పై తలపతి విజయ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా యొక్క ఓవర్సీస్ హక్కులను ఫర్స్ ఫిలిమ్స్ సంస్థ వారు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని ఈ సంస్థ వారు విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పటికే ఈ సంస్థ వారు ఈ సినిమా యొక్క జన నాయగన్ సినిమా ఓవర్సీస్ హక్కులను దక్కించుకోవడంతో వీరు ఈ సినిమాను ఓవర్సీస్ లో అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: