కొన్ని నెలల్లో భారీ ఎత్తున సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. ఇక ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో కూడా అనేక సినిమాలో విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. అందులో భారీ సినిమాలు లేకపోయినా మీడియం రేంజ్ , చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి. అలాగే అందులో కొన్ని మూవీలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో విడుదల కాబోయే సినిమాలు ఏవి ..? అవి ఏ తేదీల్లో విడుదల కాబోతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

తమిళ నటుడు అజిత్ కుమార్ హీరోగా రూపొందిన పట్టుదల సినిమాలు ఫిబ్రవరి 6 వ తేదీన తెలుగు భాషలో విడుదల చేయనున్నారు.

నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన తండెల్ మూవీ ని ఫిబ్రవరి 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన లైలా మూవీ ని ఫిబ్రవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన దిల్ రూబా సినిమాని ఈ సంవత్సరం ఫిబ్రవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు.

గౌతమ్ , బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో రూపొందిన బ్రహ్మానందం సినిమాని ఫిబ్రవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు.

సందీప్ కిషన్ హీరోగా రీతూ వర్మ హీరోయిన్గా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన మజాకా మూవీ ని ఫిబ్రవరి 21 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

బాపు సినిమాని ఫిబ్రవరి 21 వ తేదీన విడుదల చేయనున్నారు.

జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాను ఫిబ్రవరి 21 వ తేదీన విడుదల చేయనున్నారు.

డ్రాగన్ మూవీ ని ఫిబ్రవరి 21 వ తేదీన విడుదల చేయనున్నారు.

శబ్దం మూవీ ని ఫిబ్రవరి 28 వ తేదీన విడుదల చేయనున్నారు.

అగస్త్య మూవీ ని ఫిబ్రవరి 28 వ తేదీన విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: