గత ఎడాది పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారి తొక్కిసలాట  జరగడం జరిగింది.. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్  ఇప్పటికీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ విషయం అటు ఇండస్ట్రీలో ఒక పెద్ద చర్చే జరిగింది.. అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వగా బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పటివరకు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్న శ్రీతేజ్.. ఆరోగ్యం గురించి అటు అల్లు ఫ్యామిలీతో పాటు తెలంగాణ ప్రభుత్వంతో పాటుగా చాలా మంది సెలబ్రిటీలు కూడా శ్రీ తేజ్ కి అయ్యే ఖర్చును కొంత మేరకు ఇచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా ప్రముఖ నిర్మాతరాలు ఒకరైన  నిర్మాత బన్నీ వాసు శ్రీ తేజ్ ను పరామర్శించినట్లు తెలుస్తోంది.


కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన దాన్ని వాసు శ్రీ తేజను మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రి వైద్యుల సలహా మేరకు ఇలా విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందుకు అయ్యే వైద్య ఖర్చులను కూడా తామే భరిస్తామంటూ బన్నీ వాసు తెలియజేసినట్లు సమాచారం. అల్లు అర్జున్ కోటి రూపాయలు , సుకుమార్ 50 లక్షలు నిర్మాతలు 50 లక్షలు ఇవ్వడం జరిగింది.


అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా 25 లక్షలు ఇవ్వగా  మొత్తం అంతా కూడా శ్రీ తేజ్ వైద్యం కోసమే ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీ తేజ్ మెరుగైన ఆరోగ్యాన్ని అందించడం కోసం విదేశాలకు తీసుకువెళుతున్న విషయం అల్లు అర్జున్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ సినిమాలు విషయానికి వస్తే.. డైరెక్టర్ త్రివిక్రమ్ తో తన తదుపరిచిత్రాన్ని చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: