రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు యాంకర్ గా నటిగా అనసూయ భరద్వాజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. నిరంతరం ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతూనే ఉంది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూకు ఇచ్చిన అనసూయ ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ముఖ్యంగా అనసూయ చెప్పిన వ్యాఖ్యలు కూడా చాలా ధైర్యంగా చెప్పినట్టుగా కనిపిస్తోంది. అయితే అనసూయ సినిమా ఛాన్స్ పేరుతో వాడుకునేందుకు హీరోలు దర్శక నిర్మాతలు చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారని తెలిపింది. ఇలాంటిది తన విషయంలో కూడా జరిగింది అంటూ తెలియజేయడం జరిగింది అనసూయ.


ఈ విషయం విన్న అభిమానులు ఆశ్చర్యపోయిన ఒక స్టార్ హీరో తనని ఇలాగే అడిగితే నో చెప్పానని ఒక స్టార్ డైరెక్టర్ కూడా అడిగినప్పటికీ సింపుల్ గా వాటిని రిజెక్ట్ చేశానని వెల్లడించింది. దీనివల్ల తనకు సినిమా అవకాశాలు కూడా తగ్గాయని తెలియజేసింది అనసూయ. ఇలాంటివి ఇండస్ట్రీలో కామన్ గా జరుగుతూ ఉంటాయని వెల్లడించింది. అలాంటి వాటికి నో చెప్పడం లేదా ధైర్యంగా ఎదుర్కొని తత్వం ఉండాలి అని వెల్లడించింది. అనసూయ తాజాగా ఒక యూట్యూబ్ పాడ్ కాస్టులో ఈ విషయాలను తెలియజేసింది.


కానీ అనసూయహీరో పేరు, డైరెక్టర్ పేరు మాత్రం చెప్పలేదు.. అలాగే తన చిన్న వయసులో స్కూల్లో చదువుకునే సమయంలో తనకు చాలామంది ప్రపోజ్ చేశారని.. స్కూల్లో ఎలాగైతే రిజెక్ట్ చేశానో ఇండస్ట్రీలోకి వచ్చాక కమిట్మెంట్స్ అడిగితే అలాగే నో చెప్పానని తెలియజేసింది అనసూయ.. అలా అమ్మాయిలను లోపరుచుకొని అవకాశాలు ఇవ్వడం కంటే వారి టాలెంట్ను చూసి గుర్తించి అవకాశాలు ఇస్తే చాలామంది అమ్మాయిలు సైతం ఇండస్ట్రీకి వస్తారని తెలియజేసింది. అమ్మాయిలను ఆట బొమ్మలాగా కాకుండా వారికి ఇచ్చిన పాత్రలను కరెక్టుగా చేసిందా లేదా  అని దర్శక నిర్మాతలు అనుకోవాలని సలహా ఇచ్చింది. మొత్తానికి అనసూయ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: