టాలీవుడ్ ఇండస్ట్రీలో... టాప్ మోస్ట్ హీరోయిన్ గా సమంత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో తెలుగులో సినిమాలు చేయనప్పటికీ... సమంత క్రేజ్ ఎక్కడ తగ్గలేదు. రోజురోజుకు పెరుగుతుంది తప్ప... ఆమె అంటే.. నెగిటివిటీ మాత్రం తెలుగులో లేదు. అక్కినేని నాగచైతన్య విడాకులు ఇచ్చిన తర్వాత.. హీరోయిన్ సమంతకు సింపతి మరింత పెరిగింది. అయితే తాజాగా హీరోయిన్ సమంత గురించి ఓ సంచలన విషయం తెరపైకి వచ్చింది.


ఓ ప్రముఖ దర్శకుడితో సమంత డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ తతంగం జరుగుతోందట. దర్శకుడు రాజు నిడిమోర్ తో హీరోయిన్ సమంత ప్రేమలో పడ్డట్లు సోషల్ మీడియాలో వార్తలు నడుస్తున్నాయి. తాజాగా పికిల్ బాల్ టోర్నమెంట్  లో చెన్నై జట్టు యజమానిగా ఉన్న సమంత... ఆ టోర్నమెంట్ ఆరంభంలో రాజుతో కలిసి చాలా ఎంజాయ్ గా కనిపించారు.


అంతేకాదు రాజు చేతిని గట్టిగా పట్టుకొని సమంత కూడా.... సందడి చేశారు.  దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఇంకేముంది... రాజ్ అలాగే హీరోయిన్ సమంత మధ్య ఏదో జరుగుతోందని... వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కూడా చర్చ జరుగుతోంది.  ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారని... త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారని అంటున్నారు.


 అయితే దీనిపై ఇప్పటివరకు సమంతా లేదా రాజు కానీ స్పందించలేదు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత.... సమంత సింగిల్ గానే ఉంటున్నారు. కానీ అక్కినేని నాగచైతన్య మాత్రం హీరోయిన్ శోభితను రెండవ పెళ్లి చేసుకున్నాడు. దాదాపు మూడు సంవత్సరాల పాటు సింగిల్ గా ఉన్న అక్కినేని నాగచైతన్య....  చివరికి శోభితను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇంత జరుగుతున్నా కూడా సమంత మాత్రం... సింగిల్ గానే ఉంటూ సినిమాలు చేసుకుంటుంది. అలాగే పలు వ్యాపారాలలో పెట్టుబడులు కూడా పెడుతుంది హీరోయిన్ సమంత. ఇలాంటి తరుణంలోని దర్శకుడు రాజతో కలిసి కనిపించడం... హాట్ టాపిక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: