టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక మెరుపు మెరుస్తున్నాడు ఈ ఆగ్ర హీరో అల్లు అర్జున్. ముఖ్యంగా పుష్ప 2 సినిమా అల్లు అర్జున్... క్రేజ్ ను ఎక్కడికో తీసుకువెళ్లిందని చెప్పవచ్చు. ఈ సినిమా ఇంకా కూడా రికార్డులు సృష్టిస్తూనే ఉంది. దాదాపు 2000 కోట్ల కలెక్షన్లను రాబట్టింది పుష్ప 2. అయితే అలాంటి... అల్లు అర్జున్ పర్సనల్ విషయం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

ఆయన పెళ్లికి... తన ఇంట్లో కొంతమంది ఒప్పుకోలేదట. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో అల్లు అర్జున్ ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్లు వార్తలు.. వస్తున్నాయి. 2011 సంవత్సరంలో... స్నేహ రెడ్డి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వివాహం జరిగింది. ఈ ఇద్దరు దంపతులది... ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. స్నేహ రెడ్డి  పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. నల్గొండకు చెందిన.. చంద్రశేఖర్ రెడ్డి కూతురే స్నేహారెడ్డి.

 

అప్పట్లో గులాబీ పార్టీలో కీలక నేతగా ఆయన ఉన్నారు. అయితే మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గులాబీ పార్టీకి గుడ్ బాయ్ చెప్పి కాంగ్రెస్ లోకి వచ్చారు. అయితే ఒక పెళ్లిలో అల్లు అర్జున్ అలాగే స్నేహ రెడ్డి కలిశారట. ఈ తరుణంలోనే వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డట్లు సమాచారం. ఈ విషయాన్ని 2011 సంవత్సరంలోనే.. తన తల్లికి అల్లు అర్జున్ చెప్పారట. ఈ విషయం చెప్పడంతో మొదట... ఆమె ఒప్పుకోలేదని సమాచారం.

 కానీ అల్లు అర్జున్ కాస్త అలగడంతో... ఇంట్లో అందరూ పెళ్లికి ఒకే చెప్పారట. ఆ తర్వాత 2011 సంవత్సరంలోనే అల్లు అర్జున్ అలాగే స్నేహ రెడ్డి వివాహం చాలా గ్రాండ్గా జరిగింది. ఇక ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో అయాన్ ఒకరైతే ఆధ్యా మరొకరు. ఈ ఇద్దరు పిల్లలు కూడా.... అల్లు అర్జున్ తో ప్రతి ఫంక్షన్కు వస్తూ ఉంటారు.  సోషల్ మీడియాలో కూడా స్నేహ రెడ్డి అలాగే వాళ్ల పిల్లలకు ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. అప్పుడప్పుడు తన అందాలను స్నేహ రెడ్డి కూడా సోషల్ మీడియాలో ఆరబోస్తా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: